Breaking News

జపాన్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌక.. తరిమికొట్టిన రష్యా.. తీవ్ర ఉద్రిక్తత


తమ ప్రాదేశిక జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికా‌కు చెందిన క్షిపణి విధ్వంసక నౌకను తరిమికొట్టామని రష్యా శుక్రవారం ఓ ప్రకటన చేసింది. జపాన్ సముద్రంలో రష్యా-చైనా సంయుక్త నౌకా విన్యాసాలు నిర్వహిస్తుండగా అమెరికా క్షిపణి విధ్వంసక నౌక చాఫీ ప్రవేశించినట్టు తెలిపింది. అయితే, రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా.. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. జపాన్ సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో గైడెడ్ మిసైల్ విధ్వంసక నౌక చాఫీ సాధారణ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు యుఎస్ మిలిటరీ తెలిపింది. అయితే, రష్యా నౌక మాతం చాఫీకి 65 గజాల (60 మీటర్లు) లోపు వచ్చిందని, ఎటువంటి ఘర్షణ చోటుచేసుకోలేదని పేర్కొంది. పరస్పర చర్యలు ప్రొఫెషనల్‌గా ఉన్నాయని వివరించింది. ‘ఇరు దేశాలకు చెందిన నౌకలు పరస్పరం ఘర్షణకు దిగినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన అవాస్తమైంది.. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు లోబడే ఆపరేషన్ కొనసాగిందని’ అని అమెరికా సైన్యం వెల్లడించింది. అంతకుముందు, యాంటీ సబ్‌మెరైన్ నౌక అడ్మిరల్ ట్రిబట్స్ సిబ్బంది ‘అమెరికా నౌకను చుట్టుముట్టి ఫిరంగులను ప్రయోగించడానికి సిద్ధమ్యాం’ అని ఒక హెచ్చరికను రేడియోలో ప్రసారం చేసినట్లు రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. యుఎస్ఎస్ చాఫీ తన మార్గాన్ని మార్చడానికి బదులుగా దాని డెక్ నుంచి హెలికాప్టర్‌ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్లు సూచిస్తూ జెండాలను ఎగురవేశారు.. అంటే, అది వెనక్కు వెళ్లడం లేదా ప్రయాణాన్ని మార్చడం సాధ్యం కాదనడాకి సంకేతమని పేర్కొంది. ‘అంతర్జాతీయ నావిగేషన్ నియమాలకు లోబడి పనిచేస్తూ, అడ్మిరల్ ట్రైబట్స్ రష్యన్ ప్రాదేశిక జలాల నుంచి చొరబాటుదారుడిని తరిమికొట్టడానికి ఏర్పాట్లు చేసింది’ అని పేర్కొంది. ‘రెండు నౌకల మధ్య దూరం 60 మీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు చాఫీ చివరికి వెనక్కు వెళ్లింది.. జపాన్ సముద్రానికి పశ్చిమాన ఉన్న పీటర్ ది గ్రేట్ బేలో ఈ సంఘటన సుమారు 50 నిమిషాల పాటు జరిగింది’ని వివరించింది. అమెరికా మిలటరీ అధికారులకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సమన్లు జారీచేసింది.. ఇవి వృత్తిపరమైన చర్యలని చెప్పారు..సముద్రంలో నౌకల తాకిడి నివారణపై అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు’ అని RIA వార్తా సంస్థ పేర్కొంది. కాగా, నాలుగు నెలల వ్యవధిలో రష్యా ప్రాదేశిక జలాల నుంచి నాటో దేశాల యుద్ధనౌకను వెంబడించడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్ నౌక నల్ల సముద్రంలో క్రిమియా వద్ద తన ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించినట్ుట రష్యా ఆరోపించింది.


By October 16, 2021 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russia-says-it-chased-us-naval-destroyer-away-america-dismisses-claim/articleshow/87054005.cms

No comments