Breaking News

Megastar Chiranjeevi: ఏమ్మా.. ఇదేనా కొడుక్కి నేర్పించావు అంటూ శ్రీకాంత్ భార్యపై ‘చిరు’ కోపం


మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ త‌న‌యుడు.. ‘’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న రోష‌న్‌పై చిరు కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు. త‌న‌ను చిరంజీవిగారు అని పిల‌వ‌డంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వివ‌రాల్లోకెళ్తే.. శ్రీకాంత్ హీరోగా రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో పాతికేళ్ల ముందు వ‌చ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాను ఇప్పుడు ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే, ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి తెర‌కెక్కించారు. ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, వెంక‌టేశ్ చీఫ్ గెస్టులుగా వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఆ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం జ‌రిగింది. అదేంటంటే.. రోష‌న్ స్టేజ్‌పై మాట్లాడుతూ చిరంజీవిని ‘మెగాస్టార్ చిరంజీవిగారు’ అని సంబోధించాడు. అంతా బాగానే ఉంది కానీ, రోషన్ అలా త‌న‌ను పిల‌వ‌డం చిరంజీవికి న‌చ్చ‌లేదు. ఆయ‌న మాట్లాడే స్టేజ్‌పై మాట్లాడే సంద‌ర్భంలో ‘ఏం రోష‌న్ న‌న్నే చిరంజీవిగారు అని పేరు పెట్టి పిలుస్తావా? ఏమ్మా ఉమ‌(శ్రీకాంత్ భార్య ఊహ‌)ను ఉద్దేశిస్తూ ఏమ్మా.. ఇదేనా నీ కొడుక్కి నేర్పించావు’ అని నవ్వేశారు. ‘నేను మీ నాన్నకు అన్నయ్యను.. నీకు పెద్దనాన్న అవుతాను. అలాగే పిలువు. నువ్వు అలా పిలిస్తే ఎంతో ఆప్యాయంగా అనిపిస్తుంది’ అంటూ చిన్నపాటి స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో అందరూ నవ్వుకున్నారు. దానికి స్టేజ్‌పై ఉన్న శ్రీకాంత్, ఉహ న‌వ్వుకోగా.. రోష‌న్ ఆల్ రెడీ నాకు దెబ్బ‌లు కూడా ప‌డ్డాయి.. అన‌డం స‌ర‌దాగా అనిపించింది. ఈ సినిమాతో రాఘ‌వేంద్ర‌రావు న‌టడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. మ‌రి శ్రీకాంత్ హీరోగా చేసిన నాటి పెళ్లి సంద‌డిలా, ఆయ‌న త‌న‌యుడు రోష‌న్ హీరోగా చేసిన ‘పెళ్లి సందD’ ఎలాంటి విజ‌యాన్ని ద‌క్కించుకుంటుందో వేచి చూడాలి. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది.


By October 12, 2021 at 09:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-sweet-warning-to-srikanth-son-roshan-in-pellisandad-pre-release-event/articleshow/86957458.cms

No comments