Breaking News

Raghavendra Rao: దిల్‌రాజుకి నో చెప్పిన రాఘ‌వేంద్ర‌రావు.. చెక్ చూపించి ఎమోషనల్


ఎన్నో సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ చిత్రాల రూపొందించిన శతాధిక దర్శకుడు.. దర్శకేంద్రుడు ‘’ చిత్రంతో నటుడిగా మెప్పించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయ‌న‌కు ఈ సినిమా కంటే ముందే ఓ చిత్రంలో న‌టించ‌మ‌ని ఓ భారీ నిర్మాత రిక్వెస్ట్ చేశాడ‌ట‌. కానీ ఆయ‌న అందుకు నో చెప్పేశార‌ట‌. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా రావ‌డం గ‌మ‌నార్హం. ఓ ద‌ర్శ‌కుడి పాత్ర రేంజ్‌ను ప‌సిగ‌ట్టే టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కేంద్రుడు మ‌రి అంత మంచి పాత్ర‌లో న‌టించాల‌ని నిర్మాత అడిగిన‌ప్పుడు ఎందుకు నో చెప్పాడు? అనే సందేహం రాక మాన‌దు. ఇంత‌కీ రాఘ‌వేంద్ర‌రావుని త‌న సినిమాలో న‌టించాల‌ని రిక్వెస్ట్ చేసిన ఆ నిర్మాత ఎవ‌రో తెలుసా? . ఆ సినిమా ఏదో కాదు.. శ‌త‌మానం భ‌వ‌తి. ఈ మూవీ క‌థ రెడీ అయిన‌ప్పుడు అందులో ప్ర‌కాశ్‌రాజ్ చేసిన పాత్ర కోసం రాఘ‌వేంద్ర‌రావు న‌టిస్తే బావుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించార‌ట‌. స‌రే! అడుగుదామ‌ని ఆయ‌న ద‌గ్గ‌ర‌కెళ్లి యాక్ట్ చేయాల‌ని రిక్వెస్ట్ చేయ‌డ‌మే కాదండోయ్‌, మంచి రెమ్యున‌రేష‌న్ కూడా ఆఫ‌ర్‌ చేశార‌ట‌. కానీ ఆయ‌న దిల్‌రాజుతో మంచి అనుబంధం ఉన్న్ప‌ప‌టికీ నో చెప్పేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే పెళ్లి సంద‌డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్ప‌టం విశేషం. అయితే త‌న ఆధ్వ‌ర్యంలో శిష్యురాలు గౌరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘పెళ్లి సందD’లో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చెబుతూ త‌న అన్న‌య్య కృష్ణ‌మోహ‌న్‌తో ఉన్న రిలేష‌న్ గుర్తుకు తెచ్చుకుని ఎమోష‌న‌ల్ అయ్యారు ద‌ర్శ‌కేంద్రుడు. అన్న‌య్య కృష్ణ మోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘పెళ్లి సందD’ చేయాల‌నుకున్న‌ప్పుడు రాఘవేంద్ర‌రావు అన్న‌య్య ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ‘నేను ఈ సినిమా తొలిసారి నటిస్తున్నాను. మీరే కదా, నిర్మాత రెమ్యునరేషన్ ఇవ్వండి’ అంటే ఆయన చెక్ రాసి ఇచ్చాడట. కరోనా కారణంగా సినిమా అనుకున్న సమయంలో విడుదల కాలేదు. విడుదలయ్యేలోపు కృష్ణ‌మోహ‌న్‌రావు చ‌నిపోయారు. అన్న‌య్య మీదున్న ప్రేమ‌, అభిమానంతో ఆయ‌న ఇచ్చిన చెక్‌ను మార్చుకోకుండా త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్నారు రాఘ‌వేంద్ర‌రావు. ‘పెళ్లి సందD’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆచెక్‌ను చూపించి ఎమోష‌న‌ల్ అయ్యారు మ‌న ద‌ర్శ‌కేంద్రుడు.


By October 12, 2021 at 09:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/raghavendra-rao-rejected-dilraju-offer-and-become-emotional/articleshow/86956868.cms

No comments