Mega star Chiranjeevi: లిప్‌లాక్ చేసిన చిరంజీవి... ఏ సినిమాలోనో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవికి సినిమాల్లో ఉండే మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్స్ విజయాలు ఆయన సొంతం. ఇక ఆయన డాన్సులకు ఉండే క్రేజ్ మరో లెవల్. తన అభిమానులను దృష్టిలో పెట్టుకునే సినిమాలను ఎంచుకుంటుంటారు. హీరోయిన్‌తో కలిసి నటించే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఎక్కడా హద్దులు దాటకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. అయితే ఓ సినిమాలో ఆయన అనుకోకుండా హీరోయిన్‌తో లిప్‌లాక్ సీన్‌లో నటించాల్సి వచ్చింది. నటించారు కూడా కానీ ఆ సీన్ సినిమాలో మాత్రం కనిపించలేదు. ఇంతకీ చిరంజీవి లిప్‌లాక్ చేసిన సినిమా ఏది? ఎందుకు ఆ సీన్ సినిమాలో కనిపించలేదు అనే విషయంలోకి వెళితే, చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఘరానా మొగుడు. ఈ సినిమాలో పండు పండు.. అనే పాటను చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలో హీరోయిన్ నగ్మాతో లిప్‌లాక్ చేయాల్సి ఉంటుంది. సరే! అని అయిష్టంగానే సీన్‌ను పూర్తి చేశారు. కానీ ఆయనలోని నైతికత ఆయనకు నిద్ర రానివ్వలేదు. రాత్రంతా నిద్రపోనే లేదు. మద్రాసుకు వచ్చిన వెంటనే ఆయన ఎడిటింగ్ ల్యాబ్‌కు వెళ్లి లిప్‌లాక్ సీన్‌ను ఎడిట్ చేయించేశారు. అదన్నమాట అసలు సంగతి. రజనీకాంత్ చేసిన మన్నన్‌కు ఇది తెలుగు రీమేక్. సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో చిరంజీవి క్రేజ్ డబుల్ అయ్యింది. ఆసక్తికరమైన విషయమేమంటే... మన్నన్, ఘరానా మొగుడు సన్నివేశాలను పక్క పక్కన సైమల్‌టేనియస్‌గా చిత్రీకరించారు. అప్పట్లోనే సినిమా పది కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసి ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
By October 02, 2021 at 08:43AM
No comments