Breaking News

Lal Bahadur Shastri ‘జై జవాన్ జై కిసాన్’ నినాదంతో స్థైర్యాన్ని నింపిన ధృడమైన ప్రధాని


స్వాతంత్ర , స్వాతంత్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించారు లాల్ బహదూర్ శాస్త్రి. భారతదేశపు నిరాడంబర ప్రధానులలో ఒకరైన ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబరు 2న జన్మించారు. ఎంతో దేశభక్తిగల ఆయన తన పదిహేడో ఏటనే 1921లో సహాయ నిరాకరణోద్యమంలో అడుగుపెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో మొత్తం 9 సంవత్సరాలపాటు జైలులోనే గడిపారు. స్వాతంత్య్రం అనంతరం ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేసి ఆ తరువాత 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మహాత్మా గాంధీ ప్రభావంతో స్వాతంత్ర ఉద్యమంలో చేరి తొలుత గాంధీకి, తరువాత జవహర్‌లాట్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానేకాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టారు. నెహ్రూ అనంతరం ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని ఏకతాటిపై నడిపించాడు. ‘జై జవాన్ జై కిసాన్’అనే నినాదం ఈ యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా ముగిసింది. ఒప్పందం జరిగిన మర్నాడే తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పారు. కానీ ఈ మరణం వెనుక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమెరికా గూఢచారి విభాగం సీఐఏ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా ప్రచారం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తూ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత రవాణా మంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. 1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు. దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్‌కు బాటలు వేశారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కోసం రష్యా చేరిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపైన 1966 జనవరి 10న సంతకాలు చేశారు. ఆ మర్నాడు 1966 జనవరి 11న గుండెపోటుతో తాష్కెంట్‌లోనే ఆయన మరణించారు. మరణానంతరం 1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, సంకల్పం, దీక్షా దక్షతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాక్‌తో యుద్ధం జరిగినపుడు అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్.. యుద్ధాన్ని ఆపకపోతే మేం మీకు పీఎల్ 480 కింద పంపించే ఎర్ర గోధుమలను ఆపేస్తామని బెదిరించారు. ఆ సమయంలో భారత్‌ గోధుమల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించకపోవడం వల్ల అమెరికా అలా బెదిరించడంతో చాలా ఆత్మాభిమానం కలిగిన శాస్త్రీజీ బాధపడ్డారు. దీంతో మనం వారంలో ఒక పూట భోజనం చేయడం మానేద్దామని, దానివల్ల అమెరికా నుంచి వచ్చే గోధుమలు సరఫరా తగ్గించవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపునకు లక్షలాది మంది ఒక పూట భోజనానికి దూరంగా ఉన్నారు. ఆ ప్రకటన చేయడానికి ముందు ముందు తన భార్య లలితా శాస్త్రితో మాట్లాడుతూ.. ‘మీరు ఈరోజు రాత్రి మన ఇంట్లో వంట చేయకండి. నేను రేపు దేశ ప్రజలను కూడా ఒక పూట భోజనం ఆపేయాలని కోరబోతున్నాను... నా పిల్లలు ఆకలితో ఉండగలరా, లేదా అనేది నేను చూడాలనుకుంటున్నాను’ అని చెప్పారు. పిల్లలు ఒక పూట భోజనం చేయకుండా ఉండగలమనేది చూసినప్పుడు, దేశ ప్రజలను కూడా అలాగే చేయాలని కోరాలని అనుకున్నారని ఆయన కుమారుడు ఒక సందర్భంలో తెలిపారు.


By October 02, 2021 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/freedom-fighter-and-former-pm-of-india-lal-bahadur-shastri-birth-anniversary-in-telugu/articleshow/86698369.cms

No comments