Bala Krishna - Manchu Mohanbabu: బాలకృష్ణ వర్సెస్ మంచు ఫ్యామిలీ..బాలయ్య కాలికి గాయం
నందమూరి బాలకృష్ణ త్వరలోనే డిజిటల్ మాధ్యమంలోకి అడుగు పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారిక సమాచారం వెలువడ లేదు. కానీ, దానికి సంబంధించిన పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. తెలుగు ఓటీటీ మాధ్యమం ‘’ కోసం నందమూరి హీరో ఓ టాక్‌షోను చేస్తున్నారు. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఈ టాక్ షో త్వరలోనే ప్రేక్షకులను మెప్పించనుంది. రీసెంట్‌గానే అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణ ఈ టాక్ షోకు సంబంధించిన ఫొటో షూట్‌ను పూర్తి చేశారు. అంతకు రెండు రోజుల ముందే ‘అఖండ’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. అయితే ‘అఖండ’ సినిమా షూటింగ్‌లో బాలయ్య కాలికి చిన్నపాటి గాయమైందట. అయితే బాలకృష్ణ ఆ గాయాన్ని లెక్కపెట్టలేదట. నొప్పిని భరిస్తూనే ఫొటో షూట్‌ను పూర్తి చేశారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన ఈ నందమూరి అందగాడు, తొలిసారి అన్‌స్టాపబుల్‌గా ఎలా మెప్పిస్తారనేది అందరిలో ఆసక్తిని రేపుతోన్న అంశం. ఈ టాక్‌షో తొలుత ఎవరితో ఉండనుందనేది కూడా అందరిలో ఉత్సుకతను రేపుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటెస్ట్ సమాచారం మేరకు బాలయ్య తన టాక్‌షోలో తొలిసారి మంచు ఫ్యామిలీని కలవబోతున్నారట. మంచు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న ఈ షోకు వస్తారట. ఈ నలుగురితో ఎన్టీఆర్, తనకు, ఇండస్ట్రీకి ఉన్న అనుబంధం, అనుభవాలను బాలయ్య ప్రశ్నిస్తారని సినీ వర్గాలు అంటున్నాయి. మరి బాలయ్య వేసే ప్రశ్నలకు ఎలా సమాధానం చెబుతుందో అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రభాస్, రామ్‌చరణ్, మహేశ్ సహా అగ్ర నటీనటులందరూ ఈ టాక్‌షోలో పాల్గొనబోతున్నారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రం ‘అఖండ’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది.
By October 09, 2021 at 12:47PM
No comments