Chiranjeevi: గాడ్ ఫాదర్‌కి దెబ్బ మీద దెబ్బ! చిరంజీవి కారణంగా మరోసారి అదే రిపీట్..


ప్రస్తుతం మెగాస్టార్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఆచార్య పనులు పూర్తి చేస్తూనే మరోవైపు తన లేటెస్ట్ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు మెగాస్టార్. అయితే ఆయన తాజా సినిమా '' విషయంలో మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతుండటం మెగా అభిమానులను కాస్త కంగారు పెడుతోంది. శరవేగంగా జరుగుతున్న 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ ఇటీవలే సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కారణంగా కొన్నిరోజుల పాటు వాయిదా పడగా.. ఇప్పుడు చిరంజీవి కారణంగా మరోసారి బ్రేక్ పడింది. తన చేతికి జరిగిన సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చానని స్వయంగా ప్రకటించారు మెగాస్టార్. నిన్న (ఆదివారం) బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం చూసి అంతా షాకయ్యారు. చిరంజీవికి ఏమైంది? ఆ గాయం పెద్దదా అంటూ చాలా కంగారు పడ్డారు. ఈ విషయమై మీడియా చిరంజీవిని ప్రశ్నించగా మెగాస్టార్ అసలు విషయం బయట పెట్టారు. తన అరచేతికి చిన్న సర్జరీ జరిగిందని చిరంజీవి పేర్కొన్నారు. దీన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని, 15 రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని ఆయన తెలిపారు. గాడ్ ఫాదర్ సినిమా విషయానికొస్తే.. మలయాళ చిత్రం 'లూసీఫర్'కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తగు మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి తల్లిగా గంగవ్వను తీసుకున్నారని టాక్.
By October 18, 2021 at 11:16AM
No comments