Vijay Devarakonda - Rowdy Boys: రౌడీ బాయ్స్ కోసం రొమాంటిక్ సపోర్ట్ చేస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ!


ఆశిష్.. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబం నుంచి ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్న ఆశిష్ కోసం దిల్‌రాజు అండ్ టీమ్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ప్రమోషన్స్‌ను ఫుల్ స్వింగ్‌లో చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ భారీగానే ప్లాన్ చేసింది. ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రముఖ యంగ్ హీరో, అభిమానులు రౌడీ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రేక్షకుల నడుమ ఆ పాటను విడుదల చేయబోతున్నారట. అక్టోబర్ 20 సాయంత్రం ఆరు గంటలకు పాటను విడుదల చేస్తున్నారు. నిజానికి చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. చివరకు విడుదలను వెనక్కి తీసుకెళ్లారు. కొన్ని సీన్స్‌ను, ఓ కాలేజ్ బ్యాక్‌డ్రాప్ సాంగ్‌ను చిత్రీకరించారు కూడా. మరి ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో ‘రౌడీ బాయ్స్’ రిలీజ్ విషయంలో దిల్‌రాజు ఏమైనా ప్రకటనను విడుదల చేస్తారేమో చూడాలి. హుషారు సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఆశిష్, విక్రమ్ పాత్రలు నువ్వా నేనా అనేలా ఉంటాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, మది సినిమాటోగ్రఫీ అందించారు. దిల్‌రాజు సోదరుడు శిరీష్ తనయుడే ఆశిష్. ఈ సినిమా సక్సెస్ అయ్యి.. తమ వారసుడిగా మంచి గుర్తింపు తీసుకొస్తుందని దిల్‌రాజు అండ్ ఫ్యామిలీ నమ్మకంగా ఉన్నారు. ...........................................
By October 18, 2021 at 11:14AM
No comments