Chaysam Divorce: ముందు కాస్త బుర్ర వాడండి.. చై- సామ్ విడాకులపై వెంకటేష్ కౌంటర్! వెంకీమామ ఉద్దేశం అదేనా..?
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అంశం నాగ చైతన్య- విడాకులు. ఈ విషయంపై ఎన్నో వార్తలు వచ్చాయి. చై- సామ్ విడిపోతున్నారని, ఇప్పటికే వాళ్లకు పలు సార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని విన్నాం. అయితే రీసెంట్‌గా ఆ వార్తలను నిజం చేస్తూ తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు ఈ క్రేజీ కపుల్. ఇకపై తామిద్దరం ఇక భార్యభర్తలుగా ఉండబోవడం లేదని, కానీ స్నేహితుల్లా ఎప్పటికీ కలిసి ఉంటామని , సమంత కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ ఇష్యూపై సినీ వర్గాల్లో మరిన్ని చర్చలు షురూ అయ్యాయి. ఎక్కడ చూసినా చై- సామ్ విడాకుల గురించిన విషయాలే వినిపిస్తున్నాయి. సమంత, నాగ చైతన్య ఇలా ఊహించని నిర్ణయం తీసుకోవడంపై కారణాలను ఒక్కొక్కరూ ఒక్కో వర్షన్‌లో చెప్పుకుంటున్నారు. మరోవైపు మీడియాలో సైతం వీళ్ళ విడాకుల ఇష్యూపై భిన్న రకాల వార్తలు వస్తుండటంతో.. అసలు తప్పెవరిది? ఉన్నట్టుండి అక్కినేని ఫ్యామిలీని సమంత ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? అనే విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే అటు సమంత, ఇటు నాగ చైతన్య ముందుగానే వారి వారి ప్రైవసీకి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ప్రత్యేకంగా మీడియాతో పాటు అభిమానులను కోరినప్పటికీ.. పలు రూమర్స్ షికారు చేస్తుండటం అక్కినేని కుటుంబ సభ్యులకు, అలాగే దగ్గుబాటి వారి కుటుంబ సభ్యులకు మింగుడు పడటం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా వాల్‌పై పెట్టిన ఓ కొటేషన్ వైరల్‌గా మారింది. ఏ విషయంలో అయినా ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే వెంకటేష్.. ఇప్పుడు తన ఇన్స్‌స్టా స్టోరీగా పెట్టుకున్న కొటేషన్ చూస్తుంటే చై- సామ్ విడాకుల ఇష్యూపై పరోక్షంగా సెటైర్స్ వేశారని తెలుస్తోంది. ''నోరు తెరిచి మాట్లాడే ముందు కాస్త బుర్ర కూడా ఓపెన్ చేయాలి'' అంటూ సున్నితమైన మెసేజ్‌తో రూమర్స్ వ్యాప్తి చేస్తున్న అందరి నోరు మూయించే ప్రయత్నం చేశారు వెంకటేష్. దీంతో ఈ కొటేషన్ నెట్టింట వైరల్ అవుతోంది.
By October 05, 2021 at 10:46PM
No comments