‘మనస్సు దోచుకుంది.. ఉపిరి ఆపేస్తుంది’.. అలా మాయ చేస్తూ.. ‘శ్రీవల్లి’ వచ్చేది ఎప్పుడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఇది రెండు భాగాలుగా రూపొందనుంది. అందులో తొలి భాగం ‘ ది రైజ్’ విడుదలకు సన్నద్ధమవుతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బన్నీకి జోడీ శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుంచి ఆమె పాత్ర ‘శ్రీవల్లి’ని పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రష్మిక.. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా.. లంగావోణీలో.. పూలు పెట్టుకుంటూ కనిపించింది. ఇక లేటెస్ట్‌గా ‘పుష్ప’ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. అదీ హీరోయిన్ రష్మికకు సంబంధించినదే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అంటూ ఓ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదు భాషల్లో, ఐదుగురు సింగర్లతో ఈ పాటను పాడించారు. ఈ పాటను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి ‘శ్రీవల్లి’పై రూపొందించిన సెకండ్ సింగిల్‌ను ఈ నెల 13వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘పుష్ప రాజ్ మనస్సు దోచుకుంది. ఇప్పుడు మన ఊపిరి ఆపేసేందుకు వస్తోంది శ్రీవల్లి’ అంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ఇందులో కూడా రష్మిక లంగావోణీలో ఎంతో అందంగా మనకు కనిపిస్తోంది. ఇక మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ నటుడు ఫహాద్ పాజిల్ నటిస్తున్నారు. సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా.. ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది.
By October 05, 2021 at 12:17PM
No comments