Breaking News

కాజల్ ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్.. కొత్త పెళ్లి కూతురు కబురు పెట్టేసింది! నెట్టింట హాట్ టాపిక్


ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటుంది సోషల్ మీడియా. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఏ చిన్న హింట్ దొరికినా రకరకాల వాదనలు తెరపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ కాజల్‌కి సంబంధించిన ఓ విషయం నెట్టింట హాట్ టాపిక్ అయింది. అందుకు ప్రధాన కారణం 'ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్' అని స్వయంగా ప్రకటించడమే. కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మంచి పాపులారిటీ సంపాదించుకున్న కాజల్.. సీక్రెట్‌గా గౌతమ్ కిచ్లుతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపి చివరకు అతన్నే మనువాడింది. గతేడాది అక్టోబర్ 30వ తేదీన తన ప్రియుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రెండు మూడు హనీమూన్ ట్రిప్స్ వేసి తిరిగి సెట్స్‌పై చేరిపోయింది. భర్త అంగీకారంతో ఇప్పటికే కమిటైన సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ''ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా.. కాస్త వేచి ఉండండి'' అని పేర్కొన్న కాజల్.. దానిపై లవ్ సింబల్‌తో పాటు డాన్స్ చేస్తున్న ఏమోజీని జత చేసింది. ఇంకేముంది కాజల్ పోస్ట్ చూసి జనాల్లో ఒక్కసారిగా చర్చలు షురూ అయ్యాయి. ఇది ఖచ్చితంగా కాజల్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయమే అయి ఉంటుందని చెప్పుకుంటున్నారు జనం. గత కొన్ని రోజులుగా కాజల్ గర్భం దాల్చిందంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఆ విషయమే చెప్పబోతుందని భావిస్తున్నారు. సో.. చూడాలి మరి కాజల్ ఇదే గుడ్ న్యూస్ చెబుతుందా? లేక తన కొత్త ప్రాజెక్టుపై ఏదన్నా అప్‌డేట్ ఇస్తుందా అనేది.


By October 08, 2021 at 08:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kajal-aggarwal-important-announcement-hot-topic-in-cine-industry/articleshow/86857128.cms

No comments