Breaking News

Maha Samudram: యువ హీరోల కోసం పవన్ కళ్యాణ్.. అందుకోసం ప్రయత్నాలు ముమ్మరం!!


Rx 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో , హీరోలుగా రూపొందుతున్న మూవీ ''. రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్‌టైన్ చిత్రాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్ హీరోయిన్లుగా నటించగా జగపతి బాబు, రావు ర‌మేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేపడుతున్న యూనిట్.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నారని సమాచారం. హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 9వ తేదీన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. అయితే ఈ ఈవెంట్‌కి పవన్‌ని ముఖ్య అథితిగా రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందట చిత్రయూనిట్. ఈ మేరకు పవన్ కూడా సానుకూలంగానే స్పందించారని టాక్. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తారట. ఈ విషయం బయటకు రావడంతో మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై జనాల్లో ఆసక్తి నెలకొంది. వేదికపై మరోసారి పవన్ స్ట్రాంగ్ స్పీచ్ వినాలని కుతూహల పడుతోంది మెగా లోకం.


By October 08, 2021 at 07:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-will-attend-as-chief-guest-for-maha-samudram-pre-release-event/articleshow/86856600.cms

No comments