ఒకే ఒక్క లవ్ లెటర్.. కాలేజీ రోజుల్లో నేను! లైఫ్ సీక్రెట్స్ చెబుతూ ఓపెన్ అయిన పూజా హెగ్డే


ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పొడుగుకాళ్ల సుందరి హవా నడుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లో వరుస ఆఫర్స్ పట్టేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది పూజా. ముఖ్యంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటోంది. రీసెంట్‌గా పూజా హీరోయిన్‌గా నటించిన '' సినిమా సక్సెస్ అందుకున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది పూజా హెగ్డే. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సక్సెస్‌తో పాటు ఈ నెలలోనే తన పుట్టినరోజు రావడం రెట్టింపు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పిన పూజా.. ఈ విజయాన్ని తన పుట్టినరోజు కానుకగా భావిస్తునట్లు పేర్కొంది. అదేవిధంగా తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయిన ఆమె, తన లైఫ్‌లో ఎలాంటి ప్రేమ కథలు లేవని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకూ తనకు ఒక్క ప్రేమ లేఖా రాలేదని, కాలేజీ రోజుల్లో అయితే తాను చాలా సిగ్గరి అని తెలిపింది. ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీ అయ్యానని, లవ్ విషయంలో భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదని చెప్పుకొచ్చింది. అలాగే తనకు జైపూర్ మహారాణి గాయత్రి దేవి జీవిత కథలో నటించాలని ఆశగా ఉందని పూజా తెలిపింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా విషయానికొస్తే.. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ఫీల్ గుడ్ కథాంశంతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అఖిల్- పూజా హెగ్డే జంటగా నటించారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
By October 18, 2021 at 10:06AM
No comments