Vishnu Manchu - Prakash Raj: ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) ఎన్నికల వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనపడటం లేదు. డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా రెండు ప్యానెల్స్‌కు సంబంధించినవారు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అధ్యక్ష ప్రమాణ స్వీకార సమయంలో తను, తన ప్యానెల్.. ‘మా’ విషయంపై ఇక మీడియాతో మాట్లాడమని అన్నారు. అయితే మీడియా ఊరుకుంటుందా? సోమవారం మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మీ ప్రసన్న ఇతర కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ సభ్యులు అక్కడ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ తన ప్యానెల్‌లోని ప్రతి సభ్యుడు పడ్డ కష్టమే తనను గెలిపించిందని అన్నారు. తనకు రెండేళ్ల పాటు మా అబివృద్ధికి సంబంధించిన పనులు చేయడానికి బలానివ్వాలని స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాల గురించి ప్రశ్నించగా, అది తనకు మీడియా ద్వారానే తెలిసిందని, రాజీనామా లేఖలు తన వద్దకు రాలేదని ఆయన అన్నారు. వచ్చిన తర్వాత స్పందిస్తానని కూడా విష్ణు మంచు తెలిపారు. విష్ణు మంచు ఇలా మీడియాతో మాట్లాడటంతో అసలు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కేవలం రాజీనామాలు చేస్తున్నామని బెదిరించారా? నిజంగానే రాజీనామాలు చేయలేదా? అనే ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి. మరి ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎన్నికలు ముగిసిన వెంటనే విష్ణు ప్యానెల్‌కు సపోర్ట్ చేసిన మంచు మోహన్ బాబు తమపై దాడి చేశారని, బూతులు తిట్టారని చెబుతూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
By October 18, 2021 at 10:01AM
No comments