Samantha Ruth Prabhu: సమంతను భయపెడుతున్న వ్యక్తి ఎవరు?.. సమంత భయానికి కారణమేంటి!


ఓ వ్యక్తి శక్తిని చూసి భయపడుతుందట. నన్ను కంట్రోల్ చేసే శక్తిని నీకు ఎవరిచ్చారు? అంటూ ఆమె సదరు వ్యక్తి గురించి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. వివరాల్లోకెళ్తే.. రీసెంట్‌గా భర్త అక్కినేని నాగచైతన్యతో తెగ తెంపులు చేసుకున్న సమంత తన ప్రొఫెషనల్ వర్క్‌లో ఫుల్ బిజీగా మారుతోంది. ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్నిన ఈ చెన్నై అమ్మడు సోషల్ మీడియాలోనూ బిజీ బిజీగా ఉంది. రీసెంట్‌గా సమంత జిమ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోతో పాటు ఆ వ్యక్తి గురించి సమంత పోస్ట్ చేసిన మెసేజ్ కూడా తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? సమంత ఏమని పోస్ట్ చేసింది? అనే వివరాల్లోకెళ్తే.. మండే మోటివేషన్ అంటూ సమంత తన ఇన్‌స్టా స్టోరిలో జిమ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. కొత్తగా ఏముందని అనుకుంటున్నారా? తన బరువులో సగంకు పైగా బరువున్న 30 కిలోల డంబెల్‌ను సమంత ఈ వీడియోలో మోస్తూ కనిపించింది. ‘‘స్నేహ దేసు అసలు నన్ను కంట్రోల్ చేసే బలాన్ని నీకు ఎవరు ఇచ్చా రు. నువ్వు లేకపోయిన భయమేస్తుంది. సాధారణంగా ముప్పై కిలోల డంబెల్‌ను ఎత్తేస్తున్నాను’’ అంటూ సమంత తన జిమ్ ట్రైనర్ స్నేహ దేసు గురించి పొగుడుతూ వీడియోను పోస్ట్ చేసింది. రీసెంట్‌గానే సమంత ఏకంగా రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. ఈ రెండు సినిమాలను డెబ్యూ డైరెక్టర్స్ తెరకెక్కిస్తుండటం విశేషం. ఓ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ నిర్మిస్తుంటే.. మరో సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు త్వరలోనే సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
By October 18, 2021 at 10:43AM
No comments