Breaking News

తజక్, చైనా సరిహద్దుల్లో సూసైడ్ బాంబర్లు.. ప్రత్యేక దళాన్ని సృష్టించి తాలిబన్లు


సూసైడ్ బాంబర్లతో ప్రత్యేక దళాన్ని సృష్టించి .. వారిని సరిహద్దుల్లో మోహరించనున్నారని అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా వీరిని తజికిస్థాన్, చైనా సరిహద్దుల్లోని బదాఖ్షాన్ ప్రావిన్సుల్లో మోహరించనున్నారని తెలిపాయి. బదాఖ్షాన్ ప్రావిన్సుల డిప్యూటీ గవర్నర్ ముల్లా నిసార్ అహ్మద్ అహ్మదీ మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య ప్రాంతంలో తజికిస్థాన్, చైనా సరిహద్దుల్లో ఉన్న బదాఖ్షాన్ కోసం సూసైడ్ బాంబర్లతో ప్రత్యేక దళాన్ని సృష్టించిందని చెప్పినట్టు ఖామా ప్రెస్ తెలిపింది. ఈ ఆర్మీకి లష్కర్ ఇ మన్సూరీ అనే పేరును సూచించినట్టు అహ్మదీ తెలియజేశారు. గత అఫ్గనిస్థాన్ ప్రభుత్వ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులు జరిపిన బెటాలియన్ ఇదే అని ఆయన అన్నారు. ‘ఈ బెటాలియన్ కనుక లేకపోతే అమెరికా దళాలపై విజయం సాధించలేకపోయేవాళ్లం.. ఈ ధైర్యవంతులు పేలుడు పదార్థాల ఉన్న కోట్లు ధరిస్తారు.. అఫ్గనిస్థాన్‌లోని యుఎస్ స్థావరాలను పేల్చివేస్తారు.. వీరు అల్లాహ్ కరుణ పొందడం కోసం తమను తాము అర్పించుకునే భయం లేని వ్యక్తులు’ అని అన్నారు. లష్కరే మన్సూరితో పాటు బద్రి 313 అనే మరో బెటాలియన్ కూడా ఉంది.. కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోహరించిన అత్యంత ఆధునిక సైనిక సమూహాలలో ఒకటి. ఖామా ప్రెస్ ప్రకారం బద్రి 313 కూడా అన్ని ఆత్మాహుతి బాంబర్లతో కూడుకుని ఉంటుంది. అఫ్గనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు తమ భూభాగాన్ని మరే దేశాలపై దాడులకు స్థావరంగా ఉపయోగించుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే వారు ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)‌తో సయోధ్య కోసం తమ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. అఫ్గన్- పాకిస్థాన్ సరిహద్లులో టీటీపీగా పిలిచే పాక్ తాలిబన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జాబితాలో ఉంది. ఆగస్టులో అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. అక్కడ జైళ్లలోని మౌల్వీ ఫకీర్ మొహమద్ సహా టీటీపీకి చెందిన పలువురు నేతలను విడుదల చేశారు. తాలిబన్ల సాయంతో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)‌తో సయోధ్య కోసం తమ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల వెల్లడించారు. అఫ్గన్- పాకిస్థాన్ సరిహద్లులో టీటీపీగా పిలిచే పాక్ తాలిబన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జాబితాలో ఉంది. ‘శాంతి కోసం టీటీపీ సహ పలు ఉగ్రవాద సంస్థలు పాక్ ప్రభుత్వంతో చర్చలు కోరుకుంటున్నాయని అన్నారు. కాబట్టి సయోధ్యలో భాగంగా వారితో మేము చర్చలు జరుపుతున్నాం అని ఇమ్రాన్ పేర్కొన్నారు.


By October 03, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-to-deploy-suicide-bombers-at-afghanistan-badakhshan-borders-report/articleshow/86721212.cms

No comments