Breaking News

5,000 కి.మీ. లక్ష్యాన్ని చేధించే అగ్ని-5 క్షిపణి పరీక్ష సక్సెస్.. చైనాకు భారత్ పరోక్షంగా వార్నింగ్!


ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిని భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. 5,000 కిలోమీటర్లకుపైగా నిర్దేశిత లక్ష్యాన్ని ఆగ్ని-5 ఖచ్చితత్వంతో చేరుకుంది. సరిహద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ.. తాజా ప్రయోగంతో భారత్ గట్టి సందేశం పంపింది. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి లేదా ఐసీఎంబీని బుధవారం రాత్రి 7.50 గంటలకు ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి విజయవంతంగా ప్రయోగించారు. మూడు-దశల ఘన ఇంధనంతో కూడిన ఇంజిన్‌ను ఉపయోగించే ఈ క్షిపణి.. అత్యంత ఎక్కువ ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. భారత్ విధానానికి అనుగుణంగా ‘విశ్వసనీయమైన కనీస నిరోధం కలిగి ఉన్న’ అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడంతో తొలుత ఉపయోగించలేమనే నిబద్ధతను బలపరుస్తుంది. జలాంతర్గామి ఆధారిత అణు క్షిపణులతో పాటు భారత అణు నిరోధకానికి ఈ క్షిపణి పునాది. ఈ శ్రేణికి దగ్గరగా ఇంకా ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. ఇదిలా ఉండగా, ఈ ఖండాతర క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వాస్తవానికి అగ్ని-5 పరీక్ష 2020లోనే జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ విజృంభణతో వాయిదా పడింది. అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అగ్ని-1 700 కి.మీ., అగ్ని-2 2,000 కి.మీ., అగ్ని-3 2,500 కి.మీ., అగ్ని-4 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యంలో రూపొందించారు. ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. అయితే, తాజాగా పరీక్షించిన అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి 8వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించనున్నట్లు సమాచారం. కానీ, దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఏదిఏమైనా తాజా ప్రయోగంతో భారత్ శక్తి ప్రపంచానికి మరోసారి తెలిసినట్టయ్యింది. పరీక్షకు సంబంధించిన రెండు ముఖ్యమైన అంశాలలో ఒకటి ట్రై-సర్వీసెస్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC) ద్వారా సాయుధ దళాలలోకి ప్రవేశించిన మొట్టమొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. రెండు, ఇంతకు ముందు ఏడుసార్లు పరీక్షించిన క్షిపణిని రాత్రి సమయంలో ప్రయోగించడం ఇదే తొలిసారి. బుధవారం 1.5 టన్నుల వార్‌హెడ్‌తో కూడిన క్షిపణిని ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి రాత్రి 7.50 గంటలకు ప్రయోగించారు. ధ్వని కంటే 24 రెట్లు వేగంతో దూసుకెళ్తున్న ఈ క్షిపణి బంగాళాఖాతంలో కూలడానికి ముందు రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్‌లు, టెలిమెట్రీ స్టేషన్లు, నౌకల ద్వారా దాని మార్గం, విమాన పారామీటర్స్‌ను నిరంతరం పర్యవేక్షించినట్టు అధికారి తెలిపారు.


By October 28, 2021 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-sucessfully-tests-agni-v-missile-with-5000-km-range-and-strong-message-to-china/articleshow/87323527.cms

No comments