Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కారు వెనుక పరిగెత్తిన అభిమాని.. విషయం తెలిసిన పవర్ స్టార్ ఏం చేశారంటే?
అభిమానులందూ వీరాభిమానులు వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక స్టార్ హీరోలకు ఉండే వీరాభిమానులు చూపించే ప్రేమను వెల కట్టలేం. అలాంటి వీరాభిమానులు ఉండే హీరోల్లో పవర్‌స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. రీసెంట్‌గా ఆయన రాజమండ్రిలో జనసేన పార్టీ మీటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లారు. పవన్ కాన్వాయ్ మీటింగ్‌కు వెళుతున్న క్రమంలో ఓ అభిమాని దాదాపు మూడు కిలోమీటర్లు వరకు పవన్ కారును ఫాలో అవుతూ కారు పక్కనే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మూడు కిలోమీట్లరు ఓ అభిమానిని తన కారుని ఫాలో అయిన వైరల్ వీడియో పవన్ కళ్యాణ్ వరకు వెళ్లింది. సదరు అభిమాని పేరు మహేశ్. ఆ అభిమానిని ఫోన్ చేసి పవన్ ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. అతని గురించిన వివరాలను తెలుసుకున్నారు. ఇప్పుడా ఫొటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఏదేమైనా మా పవర్‌స్టార్ మనసు బంగారం అని ఆయన అభిమానుల ఆనుకుంటూ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు తమ హీరోలను కలుసుకోవడానికి నిజంగానే సాహసాలు చేస్తున్నారు. కొందరు వందల కిలీమటర్లు కాలినడకన వచ్చి హీరోలను కలుసుకుంటుంటే, కొందరు సైకిళ్లు, బైకులపై వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ హీరోలను కలుసుకుంటున్నారు. రీసెంట్ టైమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రియల్ హీరో సోనూసూద్‌లను వారి అభిమానులు ఇలాగే కలుసుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు మరి.
By October 09, 2021 at 12:08PM
No comments