Breaking News

AlluArjun: ఆర్గానిక్ వ్యవసాయంపై అల్లు అర్జున్ ఫోక‌స్‌.. అందుకు ఏం చేస్తున్నాడో తెలుసా?


‘’ అనే పాన్ ఇండియా మూవీతో సందడి చేయడానికి సిద్ధపడుతున్న ఐకాన్ స్టార్ మ‌రో కొత్త ఆలోచ‌న చేయ‌బోతున్న‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కీ అల్లు అర్జున్ ఏం చేయ‌బోతున్నాడో తెలుసా? ఆర్గానిక్ వ్య‌వ‌సాయం. ఇంత‌కీ ఉన్న‌ట్లుండి బ‌న్నీకి ఆర్గానిక్ వ్య‌వ‌సాయం ఎందుకు చేయాల‌నిపించింది? అనే ఆలోచ‌న రావ‌చ్చు. ఎందుకంటే.. అందుకు ‘పుష్ప’ సినిమాయే కార‌ణమ‌ట‌. ఈ సినిమాను ఎక్కువ భాగం అడ‌విలో, ప్ర‌కృతి అందాల మ‌ధ్య‌లో చిత్రీక‌రించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌కృతిని ప్రేమించే అల్లు అర్జున్‌కు ఇంకా ఆ ఇష్టం పెరిగింది. దీంతో ఆయ‌న త‌న జీవ‌న ప‌ద్ధ‌తుల్లో ముఖ్య భాగ‌మైన ఆహార అల‌వాట్ల‌ను మార్చుకోవాల‌ని అనుకున్నారు. అందుకోసం ఆయ‌న హైద‌రాబాద్ శివారు ప్రాంత‌మైన శంక‌ర ప‌ల్లిలో రెండు ఎక‌రాల భూమిని కోనుగోలు చేశార‌ట‌. ఆ భూమిని ఆర్గానిక్ ప‌ద్ధ‌తుల్లో వ్య‌వసాయం చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నార‌ని టాక్‌. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ఇప్ప‌టికే తెలుగు చిత్ర సీమ నుంచి సురేశ్‌బాబు, ఎన్టీఆర్‌, స‌మంత వంటి అగ్ర తార‌లెంద‌రో ఆర్గానిక్ వ్య‌వ‌సాయంపై ఆస‌క్తి పెంచుకుని, సిటీకి దూరంగా కాయ‌గూర‌లు, చిన్న పంట‌ల‌ను పండిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వ‌చ్చేస‌రికి ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప ది రైజ్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతుంది. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌న స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బ‌న్నీ ర‌గ్డ్ లుక్‌తో పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ మెయిన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


By October 09, 2021 at 11:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-focused-on-organic-farming-and-brought-agricultural-land/articleshow/86885903.cms

No comments