Most Eligible Bachelor : ఇలాంటి సమయంలో ధైర్యం కావాలి!.. నాగ చైతన్యపై అఖిల్ కామెంట్స్
అక్కినేని పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాకు మోక్షం లభించింది. ఎన్నో వాయిదాల అనంతరం అక్టోబర్ 15న రాబోతోన్నట్టు ప్రకటించారు. దసరా కానుకగా బరిలోకి దిగింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రమోషన్స్ కూడా పెంచింది చిత్రయూనిట్. అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ అక్కినేని ఎమోషనల్ అయ్యాడు. తన సినిమా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి వివరించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. అభిమానులు తన మీద పెట్టుకున్న అభిమానం, నమ్మకాన్ని నిలబెట్టుకునే వరకు నిద్రపోను.. ప్రయత్నిస్తూనే ఉంటాను అని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో థియేటర్లు, సినీ పరిశ్రమ ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ఇలాంటి కష్టసమయంలో సినిమాను విడుదల చేయాలంటే ధైర్యం కావాలని, మా అన్న సినిమాతో ముందుకు వచ్చాడు. వారు ధైర్యం చేసి సినిమాను తీసుకొచ్చారని అన్నాడు. పూజా హెగ్డేపై అఖిల్ చేసిన కామెంట్లు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే అద్భుతమైన నటి. కష్టపడేతత్త్వమే ఆమెలో నాకు బాగా నచ్చుతుంది. అందుకే ఆమె ఈ స్థాయిలో ఉంది. కెరీర్ అంటే ఇష్టపడేవాళ్లంటే నాకు చాలా ఇష్టమని అఖిల్ అన్నాడు. ఇక అల్లు అరవింద్ గురించి కూడా మాట్లాడాడు. మన ఫ్యామిలీల మధ్య ఉన్న ఆ బంధం, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను.. ఇంకో ఫంక్షన్ మనం పెట్టుకుంటాం.. అప్పుడు మీ గురించి మాట్లాడతాను అంటూ అల్లు అరవింద్‌తో ఉన్న అనుబంధంపై అఖిల్ కామెంట్ చేశాడు.
By October 09, 2021 at 11:42AM
No comments