Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ అప్డేట్.. ముగిసిన లంకేశుడి పాత్ర!
ప్రస్తుతం ఆది పురుష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ యూనిట్ తాజాగా ఓ అప్డేట్‌ను అందించారు. లంకేశుడి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆది పురుష్‌కు ఆరంభంలోనే ఆటంకం ఎదురైందన్న సంగతి తెలిసిందే. మొదటి రోజే షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం ఏర్పడింది. అలా మొత్తానికి షూటింగ్ మాత్రం ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండానే జరుగుతోంది. ఈ క్రమంలోనే లంకేశుడి పాత్రలో సీన్స్‌ను తెరకెక్కించేశామని, షూట్ పూర్తయిందని దర్శకుడు ప్రకటించాడ. సైఫ్ అలీ ఖాన్‌కు చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ క్రమంలో కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ చేశారు. వెండితెరపై ఇది వరకు ఎన్నడూ చూడని కొన్ని సన్నివేశాలుంటాయి. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రభాస్‌తో కలిసి పని చేయడం ఎంతో గొప్పగా అనిపించింది. ఆయన ఎంతో మంచి మనిషి. జెంటిల్మెన్. అంటూ ప్రభాస్ గురించి సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అందరినీ భయపెట్టేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రాబోతోన్న సంగతి తెలిసిందే.
By October 09, 2021 at 10:57AM
No comments