Singer Mangli: నితిన్‌పై మంగ్లీ కామెంట్స్ వైరల్.. అసలు హీరో లాగే లేడంటూ ఓపెన్
యంగ్ హీరో నితిన్ '' అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హిందీలో సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘అంధాధున్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. రచ్చ రవి, సింగర్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 17న ఈ మూవీ డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (సెప్టెంబర్ 14) సాయంత్రం నిర్వహించారు. ఇందులో సింగర్ మంగ్లీ చెప్పిన మాటలు సినిమాపై హైప్ పెంచేయడమే గాక అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నితిన్ సింప్లిసిటీపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మంగ్లీ మాట్లాడుతూ.. ''నేను మీ అందరికీ సింగర్‌గా తెలుసు. కానీ ఈ సినిమాలో మాత్రం నన్ను యాక్టర్‌గా చూస్తారు. నన్ను నమ్మి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చిన చిత్ర యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు. నితిన్ సపోర్ట్ మర్చిపోలేనిది. ఆయన చాలా కూల్. చాలా మంచి వ్యక్తి. మాతో సెట్స్‌లో ఒక హీరోలా ఉండలేదు. చాలా ఫ్రెండ్లీగా ఓ బ్రదర్‌లా అందరితో కలసిపోయి ఎంజాయ్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. మీరంతా బాగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు. ఈ సినిమాను నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్‌పై ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. నితిన్ కెరీర్‌లో 30వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
By September 15, 2021 at 12:15PM
No comments