Prakash Raj - Ilayaraja: ఇళయరాజా రూ.3కోట్లు అడిగారు.. నేనివ్వనని చెప్పాను: ప్రకాశ్‌రాజ్
‘ఇళయరాజాగారిని ‘మా’ కోసం ఓ మ్యూజిక్ కన్‌సర్ట్ చేయమని అడిగితే ఆయన మూడు కోట్లు అడిగారు’ అని అన్నారు ‘మా’ అధ్యక్షుడిగా పోటీ పడుతున్న ప్రకాశ్‌రాజ్. అసలు ఆయన ఇళయరాజాను అడిగారు, ఆయనెందుకు అలా సమాధానం చెప్పారు అనే విషయాల్లోకి వెళితే... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబర్ 10న జగనున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సి.వి.ఎల్.నరసింహారావు పోటీలో ఉన్నారు. వీరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. రీసెంట్‌గా ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు అసోషియేషన్‌లోని సభ్యులకు విడివిడిగా విందు కూడా ఇచ్చారు. కాగా..ప్రకాశ్‌రాజ్ జె.ఆర్.సిలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ‘మా’ కోసం తానేం చేయబోతున్నాననే విషయాన్ని వివరించారు. ‘మా’ అసోసియేషన్ అనేది ఎవరి మీదరో ఆధారపడే అసోషియేషన్ అయ్యింది. కానీ అలా కాకుండా ఫండ్స్ జనరేట్ చేసుకునే సంస్థగా ఎదగనీయడంలో తాను కీలక పాత్రను పోషిస్తానని చెప్పిన ప్రకాశ్‌రాజ్ ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడారు. ‘‘మా ప్యానెల్ వచ్చిన ఆరు నెలల్లో పది కోట్ల రూపాయల ఫండ్స్‌ను అసోసియేషన్ కోసం ఏర్పాటు చేస్తాం. ఇవ్వడానికి మనుషులు రెడీగా ఉన్నారు. దారులు కూడా మాకు తెలుసు. ఆల్‌రెడీ ఇళయరాజగారితో మాట్లాడాను. డిసెంబర్‌లో ‘మా’ కోసం ఆయన ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ మూడు కోట్లు అడుగుతున్నారటగా అని అన్నాను. నీకు తెలుసుగా అంతవుతుందని అన్నారు. నేను అంత ఇవ్వలేనని అన్నారు. సరే! కోటి రూపాయలివ్వండి అన్నారు. ఎందుకంత అనడిగితే చిత్ర, హరిహరన్ వంటి సింగర్స్ రావాలి కదా అన్నారు. ఆయన ఎదురుగానే చిత్రగారితో మాట్లాడాను. ఆమె నేను అడిగానని వస్తానని చెప్పారు. మనం మర్యాదగా అడిగితే వస్తారండి. ఏం దేవిశ్రీ ప్రసాద్ మా ప్రోగ్రామ్‌లో ఓ పాట పాడడా..ఇళయరాజాగారు వస్తున్నారని, ఆర్టిస్టులు తరపున కీరవాణిగారు నిల్చుని స్వాగతించరా! ఇళయరాజాగారు, ప్రకాశ్‌రాజ్ మా కోసం ఓ ప్రోగ్రామ్ చేస్తున్నారని, ముఖ్యమంత్రి భోజనానికి పిలవరా! రెండున్నర గంటల పాటు మా అసోసియేషన్ తన సభ్యుల కోసం ఎంత గొప్ప పని చేస్తుందని అందరి ముఖాల్లో నవ్వు తీసుకురాలేమా!. మనం చేయగలుగుతాం. నేను ఏదో చేస్తానని వచ్చే ఎవరూ ఏమీ చేయరు. పది మందితో కలిసి ఏదైనా చేస్తాననేవారే పనిని సమర్ధవంతంగా చేస్తారు. అందరూ అనుకుంటున్నట్లు 900 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్‌లో దాదాపు 250 మంది యాక్టివ్ మెంబర్స్ కారు. మరో 200 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన, బాగా సెటిలైన ఆర్టిస్టులున్నారు. వీరందరినీ కాకుండా చూస్తే మిగిలింది దాదాపు 450 మంది సభ్యులు మాత్రమే. వీరిలో కూడా స్టార్ హీరోలు, బాగా సెటిల్ అయినవారు ఓ 200 మంది ఉంటారు. వారందరరూ పోగా.. మిగిలిన 250 మంది సభ్యలకు మాత్రమే అసోసియేషన్ తరపున సపోర్ట్ అందాల్సి ఉంది. బాధ్యతను పెంచుకోవాలి, పంచుకోవాలి’’ అన్నారు.
By September 15, 2021 at 11:46AM
No comments