Breaking News

Most Eligible Bachelor: లెహరాయి సాంగ్.. పూజా హెగ్డేతో అఖిల్ రొమాన్స్ పీక్స్


కెరీర్‌లో టర్న్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ '' సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చిత్రంలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 8వ తేదీన థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా ఫీల్ గుడ్ సాంగ్ 'లెహరాయి' రిలీజ్ చేశారు. ఎంతో అద్భుతంగా సాగిపోతున్న ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతో అఖిల్ రొమాన్స్ పీక్స్‌లో ఉంది. రొమాంటిక్ జోడీగా యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేశారు. ఇక ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్ ఎప్పటిలాగే తనదైన గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేశారు. గోపి సుందర్ అందించిన బాణీలు పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటిదాకా చూపించని డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తున్నారని టాక్. చిత్రంలో అఖిల్, పూజా హెగ్డే రొమాంటిక్ డోస్ యూత్ ఆడియన్స్‌కి కిక్కివ్వబోతుందట. ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.


By September 15, 2021 at 01:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/leharaayi-lyrical-song-released-from-akkineni-akhils-most-eligible-bachelor/articleshow/86223890.cms

No comments