Samantha: ఇదన్నమాట మ్యాటర్! నాగ చైతన్య కామెంట్‌తో చై- సామ్ విడాకులపై ముదిరిన అనుమానాలు
ఒకరినొకరు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య- సమంత. పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకొని అక్కినేని వారింట అడుగుపెట్టింది సామ్. హీరోయిన్లందరిలో తాను భిన్నం అన్నట్లుగా పెళ్లి తర్వాత వరుస సినిమాలతో సత్తా చాటింది. అటు , ఇటు తెలుగు ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తున్న క్రమంలో ఓ పిడుగు లాంటి వార్త అక్కినేని అభిమానుల్లో గుబులు పుట్టించింది. అదే చై- సామ్ డివోర్స్. గత కొన్ని రోజులుగా నాగ చైతన్య- సమంత విడాకుల మ్యాటర్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తన ట్విట్టర్ ఖాతాలో అక్కినేని అనే పదాన్ని సమంత తొలగించేయడం, అదేవిధంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చైతూతో దిగిన ఏ ఒక్క పిక్ షేర్ చేయకపోవడం, దానికితోడు ఎప్పుడు చైతూని వెంటబెట్టుకొని టూర్స్ వేసే సామ్.. రీసెంట్‌గా ఒంటరిగా టూర్ వేయడం లాంటి పరిణామాలతో నాగ చైతన్య- సమంత విడాకుల వ్యవహారం చర్చల్లో నిలిచింది. ఇకపోతే ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇద్దరికీ కౌన్సిలింగ్ కూడా పూర్తయిందని వార్తలు వస్తుండటంతో ఈ ఇష్యూపై ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో 'లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్ కావడంతో 'విన్నర్' అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేసిన సామ్.. నాగ చైతన్యను వదిలి ఒక్క సాయి పల్లవిని మాత్రమే ట్యాగ్ చేయడంతో జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టినట్లయింది. ఇంతలో సమంత చేసిన ఆ ట్వీట్‌ని రీ- ట్వీట్ చేస్తూ 'థాంక్స్ సామ్' అని ట్యాగ్ చేశారు నాగ చైతన్య. ఇది అక్కినేని అభిమానులకు కాస్త ఊరట కలిగించినా.. కొత్త అనుమానాలు లేవనెత్తింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చైతూ 'లవ్' ఎమోజీ పెట్టలేదు కాబట్టి ఎక్కడో కొడుతోంది అంటూ కొందరు రియాక్ట్ అవుతుండగా.. చై- సామ్ డివోర్స్ మ్యాటర్‌కి ఇది ఫుల్‌స్టాప్ పెట్టడమే అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఇద్దరిపై ఓ రేంజ్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో.. మొత్తంగా చెప్పాలంటే చై- సామ్ అసలు మ్యాటర్ ఏంటనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే!.
By September 14, 2021 at 12:23PM
No comments