మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న ప్రకాష్ రాజ్.. నిరుపేద కుటుంబానికి భారీ సాయం..
ఎలాంటి పాత్రలో అయిన లీనమైపోయి.. తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు ఆయన. దక్షిణ భారత ఇండస్ట్రీల్లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసి.. అక్కడి వారి మనస్సు దోచుకున్నారు. ఆయనే . హీరోగా అయినా, విలన్‌గా అయినా, తండ్రి పాత్ర అయినా, తాత పాత్ర అయినా, ఇలా ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకే జీవం పోస్తారు ప్రకాష్ రాజ్. అయితే సినిమాలతో వినోదం పంచే ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ ముందుంటారు. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపైపు ప్రజలకు సేవలు అందిస్తుంటారు. ఇప్పటికే ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాక.. కర్ణాటకలో ఆరు ప్రభుత్వ పాఠశాలలను ఆయన తన సొంత ఖర్చుతో నడిపిస్తున్నారు. ఇక కరోనా కష్టకాలంలో ఆయన స్థాపించిన ప్రకాష్ రాజ్ ఫౌండేషన్.. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించింది. కష్టంలో ఉన్న వాళ్ల వివరాలు తెలుసుకొని వాళ్లకు తగిన సహాయాన్ని అందించింది. తాజాగా ప్రకాష్ రాజ్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. అర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్న ఓ కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. మైసూర్ శ్రీరంగపట్నంకు చెందిన ఒక ఫ్యామిలీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. అయితే ఆ కుటుంబంలోని ఓ వ్యక్తికి జేసీబీ నడపడం తెలియడంతో ఆయన తన ఫౌండేషన్ తరఫున వారికి జేసీబీని కానుకగా అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. దీని ద్వారా వాళ్ల కుటుంబంలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక కొద్ది రోజుల్లో జరుగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన తన ప్యానెల్ సభ్యులు, ఇతర వివరాలను మీడియాకు వెల్లడించారు.
By September 14, 2021 at 12:11PM
No comments