Krishnam Raju: అనుకోకుండా జరిగిన ప్రమాదం.. ఆస్పత్రిలో కృష్ణం రాజుకు వైద్యం.. ఇదీ మ్యాటర్
సోషల్‌మీడియా, వెబ్‌సైట్లు పెరిగిపోయిన తర్వాత పుకార్లు రాయడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా సినీ నటుల విషయంలో ఇది తరచూ జరుగుతూ వస్తోంది. ఎవరైన ఓ నటుడు కానీ, నటి కానీ, కొంతకాలం తెరపై కనిపించకపోతే.. వారు అనారోగ్యం పాలు అయ్యారు అని.. లేదా మరణించారు అంటూ వార్తలు రావడం పెరిగిపోయింది. గతంలో చాలా మంది సెలబ్రిటీల విషయంలో ఇదే జరిగింది. కొందరు బయటకు వచ్చి ‘నేను బతికే ఉన్నాను.. ఇంకా చనిపోలేదు’ అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా నటుడు కృష్ణం రాజుకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెబల్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న ఆయనకు సోమవారం సాయంత్రం అనుకోకుండా ఓ ప్రమాదం జరిగిందని. తన ఇంట్లోనే కాలు జారి పడిపోవడంతో.. ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో వెంటనే ఆయన్ని ఆపోలో ఆస్పత్రికి తరలించారని... అక్కడి వైద్యులు మంగళవారం ఆయనకు శస్త్ర చికిత్స అందించారని కొందరు ప్రచారం చేశారు. అయితే నిజానికి ఆయన రొటీన్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే కృష్ణం రాజు ఆపోలో ఆస్పత్రికి వచ్చారు అంటూ ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటన చేసింది. త్వరలో ఆయన యూకేకు వెళ్లాల్సి ఉన్నందన ముందు జాగ్రత్తగా.. తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొనేందుకు ఆయన అపోలో ఆస్పత్రికి వచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు.. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా కృష్ణం రాజు వైద్యులను అడిగి తెలుసుకున్నారు అని.. ఆయన త్వరగా కోలుకోవాలి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారని.. ఆయన కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
By September 14, 2021 at 12:43PM
No comments