Breaking News

డ్రగ్స్‌ కేసులో ముమైత్‌ ఖాన్.. లోతుగా ప్రశ్నిస్తూ కూపీ లాగుతున్న ఈడీ అధికారులు


టాలీవుడ్‌ను కుదిపేస్తున్న సమస్య డ్రగ్స్ కేసు. డ్రగ్స్ పెడల్స్‌తో కొందరు సెలబ్రిటీలకు సంబంధాలున్నాయనే ఆరోపణలతో గత కొన్ని రోజుల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ‌, నవదీప్‌ల విచారణ ముగిసింది. కెల్విన్‌తో వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే నేడు (బుధవారం) ముమైత్ ఖాన్ విచారణ కొనసాగుతోంది. కొద్ది సేపటిక్రితం ముమైత్‌ ఖాన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆఫీసుకు చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి పెట్టారు. కెల్విన్‌తో ఆమెకున్న సంబంధాల గురించి ఈడీ ఆఫీసర్స్ లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కెల్విన్‌తో ఎలాంటి పరిచయాలున్నాయి? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? మాదక ద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అన్వేషిస్తున్నారట. రీసెంట్‌గా న‌వ‌దీప్‌తో పాటు ఎఫ్ క్ల‌బ్ మేనేజ‌ర్‌ను ఈడీ అధికారులు ఏక కాలంలో ఒకే గ‌దిలో ఉంచి ప్రశ్నించగా.. పలు కీలక విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 17న తనీశ్, 22న తరుణ్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. డ్రగ్స్ ఇష్యూలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీల తాలూకు వాట్సాప్‌ చాటింగ్‌, కాల్‌డేటా వివరాలను సేకరిస్తూ విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు.


By September 15, 2021 at 11:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-drugs-case-mumaith-khan-at-hyderabad-ed-office/articleshow/86222624.cms

No comments