Breaking News

Mamata Banerjee ప్రధాని పదవికి ముందు వరుసలో దీదీ.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు


గత నెలలో బీజేపీకి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో.. రెండు రోజుల కిందట తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. గాయకుడిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబుల్ సుప్రియో.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన సంగీత కచేరీలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో పనిచేస్తూనే, హృదయపూర్వకంగా పాడాలని ముఖ్యమంతి కోరారని అన్నారు. ‘మమతా బెనర్జీని కలవడం చాలా సంతోషంగా ఉంది.. తృణమూల్ కుటుంబంలోకి ఆమె నన్ను ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు.. మనస్ఫూర్తిగా రాజకీయాల్లోనూ పనిచేయడమే కాదు.. గాయకుడిగా కొనసాగాలని సూచించారు.. పై’ అన్నారు. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే అభ్యర్థుల్లో తమ ముఖ్యమంత్రి ముందున్నారని బాబుల్ సుప్రియో అన్నారు. ‘2024 ఎన్నికల్లో మా పార్టీ కెప్టెన్ మమతా బెనర్జీ ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.. ప్రధాన మంత్రి పదవికి మమత ముందు వరుసలో ఉన్నారనే వాస్తవాన్ని ఎవరూ విస్మరించలేరు’ అని వ్యాఖ్యానించారు. ఎంపీ పదవికి రాజీనామా విషయమై స్పందిస్తూ.. బుధవారం ఢిల్లీ వెళ్లి స్పీకర్‌ను కలుస్తానని అన్నారు. స్పీకర్ తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే అదే రోజు రాజీనామా చేస్తానని ప్రకటించారు. ‘ ప్రధాని మోదీని ఎదుర్కోవడం, ఆయనకు ప్రత్యామ్నాయంగా మారడంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని ఇటీవల తృణమూల్ పార్టీ పత్రిక జాగో బంగ్లా ఓ కథనం రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియో చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘పార్టీలో నా పాత్ర ఏంటనేది మమతా నిర్ణయిస్తారు.. ఈ విషయం గురించి ఇంతకంటే ఏం మాట్లాడదలచుకోలేదు’ అని టీఎంసీలో మీ పాత్ర ఏంటి అనే ప్రశ్నకు ఆయన పై విధంగా బదులిచ్చారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి కొత్తవారి రాకతో ఇప్పటికే ఉన్న నేతల్లో ఆగ్రహం నెలకొని ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. దానిపై ఆ పార్టీ దృష్టిసారించాలని సూచించారు. నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో.. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో పదవిని కోల్పోయారు. ఆ నేపథ్యంలోనే తాను రాజకీయాల నుంచి దూరం అవుతున్నానని ప్రకటించి ఆశ్చర్యపర్చారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామ నుంచి టీఎంసీలో చేరిన సుస్మితా దేవ్‌కు రాజ్యసభ సీటు దక్కింది. బాబుల్ సుప్రియోను కూడా రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.


By September 21, 2021 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mamata-banerjee-among-frontrunners-for-pm-post-in-2024-elections-says-babul-supriyo/articleshow/86387151.cms

No comments