Breaking News

MAA Elections: 'మా' కోసం మనమందరం.. తన ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు


ఎప్పటిలాగే ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ () ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్స్ స్వీకరించి అక్టోబర్ 10న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరపనున్నారు. అయితే ఈ సారి అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ మెంబర్స్‌ని ప్రకటించగా.. తాజాగా అంటూ మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యుల వివరాలు తెలిపారు. వివరాలు చూస్తే.. మంచు విష్ణు- ప్రెసిడెంట్ రఘు బాబు- జనరల్ సెక్రెటరీ బాబు మోహన్- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, పృథి రాజ్- వైస్ ప్రెసిడెంట్స్ గౌతమ్ రాజు, కరాటే కళ్యాణి- జాయింట్ సెక్రటరీలు శివ బాలాజీ- ట్రెజరర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్: అర్చన అశోక్ కుమార్ గీత సింగ్ హరినాథ్ బాబు జయవాణి మలక్ పేట శైలజ మాణిక్ పూజిత రాజేశ్వరి రెడ్డి రేఖ సంపూర్ణేష్ బాబు శశాంక్ శివన్నారాయణ శ్రీ లక్ష్మి శ్రీనివాసులు.P స్వప్న మాధురి తదితరులు అక్టోబర్‌ 10న జరిగే ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన మంచు విష్ణు.. MAA కోసం తన సొంత ఖర్చులతో ఓ ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తానని మాటిచ్చారు. అదే ధ్యేయంగా ముందడుగేస్తున్నారు. ఇకపోతే ఆరంభంలో ప్రకాష్ రాజ్‌కు మద్ధతు ఇచ్చిన బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆ ప్యానల్ నుంచి బ‌య‌ట‌కు వచ్చి స్వతంత్య్ర అభ్యర్థిగా కార్యదర్శి పదవి కోసం పోటీలో నిలిచారు. ఈ పరిస్థితుల నడుమ MAA ఎలక్షన్స్ టాపిక్ జనాల్లో చర్చనీయాంశం అయింది.


By September 23, 2021 at 11:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maa-elections-manchu-vishnu-announced-his-panel-members/articleshow/86448179.cms

No comments