Breaking News

అనుభవించు రాజా టీజర్: జల్సా రాయుడు రాజ్ తరుణ్.. రామ్ చరణ్ కామెంట్స్


యువ హీరో నటిస్తున్న కొత్త సినిమా ''. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్రామీణ కథాంశం నేపథ్యంలో వినోదం ప్రధానాంశంగా తీసుకొని ఈ మూవీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న యూనిట్.. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ ఈ టీజర్ రిలీజ్ చేస్తూ.. వీడియో చాలా ఫన్నీగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌ మొత్తానికి బెస్ట్ విషెష్ చెబుతూ 'అనుభవించు రాజా' టీజర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌‌లో జల్సా రాయుడుగా రాజ్ తరుణ్ కనిపించాడు. పేకాట, కోడి పందాల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. పక్కా గోదావరి స్లాంగ్‌లో రాజ్ తరుణ్ చెప్పిన డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాలో ఏదో కొత్తదనం చూపిస్తున్నారనే ఫీలింగ్స్ తెప్పిస్తోంది. మొత్తానికైతే ఈ వీడియోతో తమ సినిమా వైపు ప్రేక్షకుల చూపు తిప్పుకుంది చిత్రయూనిట్.


By September 23, 2021 at 10:40AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/raj-taruns-anubhavinchu-raja-teaser-released-by-ram-charan/articleshow/86447136.cms

No comments