పెళ్లి సందD ట్రైలర్: రా పీకే అనేసిన రోషన్.. హోల్ సేల్ అల్లుడి హంగామా చూడండి!!
దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ''. గత పాతికేళ్ల క్రిందట పొందిన పెళ్లి సందడి ఫీల్ ఈ తరం ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మోడ్రన్ 'పెళ్లి సందD'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రాఘవేంద్ర రావు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు హీరోగా నటిస్తుండగా.. కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మహేష్ బాబు చేతుల మీదుగా వదిలిన ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. రాఘవేంద్ర రావు మార్క్ సీన్స్ ఈ వీడియోలో హైలైట్ అవుతున్నాయి. ''రా పీకే.. హోల్ సేల్ అల్లుడు'' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ''రాఘవేంద్ర రావు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న పెళ్లి సందD సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొంటూ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు మహేష్ బాబు. దీంతో ఈ సినిమాకు మహేష్ ఫ్యాన్స్ విషెస్ అందుతున్నాయి. కె. కృష్ణమోహన్ రావు సమర్పిస్తున్న ఈ సినిమాకు మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాఘవేంద్ర రావు, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
By September 22, 2021 at 12:44PM
No comments