Breaking News

దగ్గుబాటి అభిమానులకు గుడ్ న్యూస్: క్రేజీ జోడీ కుదిరింది.. బాబాయ్ అబ్బాయ్ కాంబోలో మూవీ ఫిక్స్


దగ్గుబాటి వారసులైన వెంకటేష్- కాంబో కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది ప్రేక్షకలోకం. ఒకే తెరపై బాబాయ్ అబ్బాయ్ లను చూడాలని కుతూహలంగా ఉన్నారు ఇరువురి అభిమానులు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కోరిక త్వరలోనే నెరవేరనుందని తెలుపుతూ అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో వెంకటేష్, రానా కలిసి నటించబోతున్నారు. '' అనే పేరుతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. వెంకీమామతో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు రానా దగ్గుబాటి. ఇలా తన కల నెరవేరబోతోందని తెలిపిన ఆయన వెంకీని ఆఫ్ స్క్రీన్ మీద ఎంతగా ప్రేమిస్తున్నానో 'రానా నాయుడు' లోనూ అంతే అలాగే ఉంటూ ఒకే గొంతుకగా నటిస్తున్నామని ట్వీట్ చేశారు. మరోవైపు ఇదే వెబ్ సిరీస్ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపిన విక్టరీ వెంకటేష్.. ''ఓ చిన్నపిల్లాడి నుంచి మంచి పరిణితి చెందిన నటుడిగా నా ముందు ఎదిగిన రానాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. త్వరలోనే 'రానా నాయుడు' మీ ముందుకు వస్తుంది'' అని పేర్కొన్నారు. లోకోమోటివ్ గ్లోబల్ ఇన్ కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కి కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఈ వెబ్ సిరీస్ రెడీ కానుందని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్, రానా ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. వెంకటేష్ F3 షూటింగ్‌లో పాల్గొంటుండగా.. రానా 'భీమ్లా నాయక్' మూవీ చేస్తున్నారు.


By September 22, 2021 at 11:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/good-news-for-daggubati-fans-rana-venkatesh-combo-fix/articleshow/86419655.cms

No comments