Charmy Kaur: నిజంగా చెబుతున్నా.. హాట్ హాట్‌గా నా ఎదుట!! ఛార్మి రొమాంటిక్ మెసేజ్ వైరల్
హీరోయిన్‌గా ఫుల్ పాపులర్ అయి ఒకానొక సమయంలో వెండితెరకు కొత్త శోభ తీసుకొచ్చింది ఛార్మి. తన చార్మింగ్ అందాలతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత నిర్మాత అవతారమెత్తి సత్తా చాటుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉండటం అమ్మడి హ్యాబీ. ఈ నేపథ్యంలోనే తాజాగా షేర్ చేసిన ఓ మెసేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. సింపుల్‌గా ఉన్న తన లుక్ పోస్ట్ చేసిన ఛార్మి.. 'నిజంగా చెబుతున్నా, నా ఎదుట హాట్ వ్యూ ఉంది' అంటూ ట్యాగ్ చేసింది. ఈ మేరకు , షూట్ లైఫ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఏంటా హాట్ వ్యూ? మాకూ చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'బ్లడ్..స్వెట్.. వైలెన్స్' లైగర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అంటూ 'లైగర్' నుంచి రీసెంట్‌గా ఓ స్టిల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్టిల్‌లో కండలు తిరిగిన దేహంతో హీరో కనిపించారు. దీంతో ఈ స్టిల్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఛార్మి ఇదే స్టిల్‌ని, ప్రత్యేకంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు ఇంకొందరు. డ్యాషింగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ 'లైగర్' మూవీ రూపొందుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్‌ను అక్కడ షూట్ చేస్తున్నారట.
By September 17, 2021 at 08:51AM
No comments