Breaking News

ప్రధాని మోదీ పుట్టినరోజు: ఆ రికార్డుపై భారత్ గురి.. 20 రోజుల పాటు కార్యక్రమాలు


సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. తొలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా తర్వాత ప్రధానిగా మోదీ ప్రయాణాన్ని ప్రారంభించి అక్టోబరు 7 నాటికి 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో 20 రోజులపాటు దేశ వ్యాప్తంగా సేవ, సమర్పన్‌ అభియాన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ‘ఆరోగ్య మహిళ, ఆరోగ్య భారత్‌’ పేరిట మహిళలకు, బాలికలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధాని పుట్టిన రోజు కానుకగా ఇప్పటి వరకూ టీకా తీసుకోనివారికి వ్యాక్సిన్ సేవ కార్యక్రమం ద్వారా వ్యాక్సినేషన్‌ వేయనున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించడంతోపాటు, ఉచిత వ్యాక్సిన్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వ్యాక్సినేషన్ సాధారణ రోజుల కంటే ప్రధాని జన్మదినం సందర్భంగా రెట్టింపు పంపిణీ జరిగేలా చూడాలని అధికారులను బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదేశించారు. శుక్రవారం దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి వ్యాక్సినేషన్ అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కోసం దాదాదపు 8 లక్షల మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు కోట్ల పోస్టుకార్డులు పంపే కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ‘పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు.. వ్యాక్సిన్ అందజేసినందుకు’ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తామని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, ప్రధాని 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని యూపీలోని 71 చోట్ల గంగా నది శుభ్రపరిచే కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ‘ జీవితం, అతని విజయాలపై దృష్టి సారించే కార్యక్రమాలకు మేధావులు, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తాం.. వివిధ భాషలలో ప్రజలకు చేరువయ్యేలా ప్రముఖ వ్యక్తుల అభిప్రాయాలు, కథనాలు ప్రచురిస్తాం’ అని బీజేపీ ప్రకటించింది. జిల్లా స్థాయిలో ఆరోగ్య శిబిరాలు, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు. ఇందులో మహిళా నేతల కీలక పాత్ర పోషించనున్నారు. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా భారీ ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే, ఖాదీ, స్వదేశీ వస్తువుల వాడాకాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టనున్నారు.


By September 17, 2021 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-planned-20-day-mega-event-occation-of-pm-narendra-modi-birthday/articleshow/86281978.cms

No comments