ఎన్టీఆర్ కారుకు ఫ్యాన్సీ నెంబర్.. వేలం పాటలో పాల్గొన్న యంగ్ టైగర్.. ఎంత వెచ్చించారంటే..!
లగ్జరీ కారు కొనడం ఎంత ప్రెస్టేజిగా ఫీల్ అవుతుంటారో దానికి తీసుకోవడం అంతకంటే ప్రెస్టేజిగా భావిస్తుంటారు జనం. సాధారణ ప్రజలే ఇలా ఉంటే ఇక సెలబ్రిటీలు, బడా వ్యాపార వేత్తలయితే తమ తమ కార్లకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. తాజాగా సినీ నటుడు జూనియర్ కూడా తన కారు కోసం ఫ్యాన్సీ నెంబర్ ఎంచుకొని దానికి లక్షల్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల ఫ్యాన్సీ నంబర్ల వేలం వేశారు. ఇందులో TS09 FS 9999 నంబర్‌ను స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేజిక్కించుకున్నారట. ఈ నెంబర్ కోసం వేలం పాటలో 17 లక్షల రూపాయలు చెల్లించారట ఎన్టీఆర్. ఆయనతో పలువురు వ్యాపార వేత్తలు ఈ వేలం పాటలో పాల్గొని కొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ చేజిక్కించుకున్నారని హైదరాబాద్ జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా వెలుగొందుతూ తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్.. సినిమాలపై ఎంత ఆసక్తి చూపుతూ కెమెరా ముందు సత్తా చాటుతుంటారో, లగ్జరీ కార్ల విషయంలోనూ అంతే ఇష్టంగా ఉంటారని టాక్. ఆయనకు కొత్త కొత్త మోడల్స్ కార్లంటే మహా ఇష్టమట. మార్కెట్ లోకి కొత్త బ్రాండెడ్ కారు వచ్చిందంటే చాలు దాని గురించి ఆరా దీస్తుంటారట. ఇప్పటికే ఆయన గ్యారేజీలో చాలా టాప్-ఎండ్ కార్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఇటలీ నుంచి మరో లగ్జరీ మోడల్ లంబోర్ఘిని యూరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ కారును ఇటీవలే దిగుమతి చేసుకున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ సినిమాలంటారా.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో మరో హీరోగా రామ్ చరణ్ భాగమవుతున్నారు. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా లైన్‌లో పెట్టారు ఎన్టీఆర్.
By September 23, 2021 at 07:12AM
No comments