Tollywood Drugs Case: ఈడీ కార్యాలయానికి తరుణ్.. కీలక అంశాలపై ఆరా తీస్తున్న అధికారులు
నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌ని డ్రగ్స్ కేసు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీలను ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ చేసింది. దర్శకుడు , రవితేజ, నవదీప్, హీరోయిన్ ఛార్మి తదితరులు అప్పుడు విచారణకు హాజరు అయ్యారు. పలువురు టెక్నిషన్ల కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఇందులో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అప్పుడు ఆరోపణలు ఎదురుకున్న సెలబ్రిటీలు అందరికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్(ఈడీ) రీసెంట్‌గా సమన్లు పంపించింది. ఇందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి, , నటుడు రానా, నవదీప్, నందు, నటి ముమైత్ ఖాన్ తదితరులను ఈడీ విచారణ చేసింది. వీరితో పాటు డ్రగ్ పెడ్లర్ కెల్విన్, అతని సహచరుడిని కూడా ఈడీ విచారిస్తోంది. కేవలం డ్రగ్స్‌కు సంబంధించిన అంశమే కాకుండా.. బ్యాంకు లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ తదితర అంశాలకు సంబంధించిన విషయాలను కూడా సేకరిస్తున్నారు ఈడీ అధికారులు. తాజాగా ఈ కేసులో విచారణకు నటుడు బుధవారం హాజరు అయ్యారు. ప్రస్తుతం ఆయనని ఈడీ అధికారులు అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ చేసిన విచారణలో భాగంగా హీరో తరుణ్, పూరి జగన్నాథ్ నమూనాలను 2017 జులైలో అధికారులు సేకరించారు. వీటిని పరీక్షిన తర్వాత వాళ్లు ఎలాంటి డ్రగ్స్‌ని వినియోగించలేదు అంటూ క్లీన్ చీట్ ఇచ్చారు. అంతేకాక.. తాజాగా కేసును తప్పుదోవ పట్టించేందుకు సినీ ప్రముఖల పేర్లు ఇందులో జత చేశారు అంటూ ఎక్సైజ్ శాఖ ఓ నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో తరుణ్ ఈ విచారణకు హాజరుకావడం సర్వత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలెవరైనా మీకు తెలుసా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
By September 22, 2021 at 11:56AM
No comments