Breaking News

చైనాను దీటుగా ఎదుర్కోవడానికి రాకెట్ ఫోర్స్ ఏర్పాటు.. సీడీఎస్ చీఫ్ రావత్ వ్యాఖ్యలు


రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాల నుంచి ఎదురవుతున్న జాతీయ భద్రతా సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికత వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే కశ్మీర్‌లో పరోక్ష యుద్ధం చేస్తున్న ఇప్పుడు పంజాబ్‌ సహా ఇతర ప్రాంతాల్లో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని రావత్‌ ఆరోపించారు. ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో బుధవారం జరిగిన శామ్యూల్ హంటింగ్టన్ సెమినల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రువులు ప్రత్యక్ష దాడులకు తెగబడినా, సాంకేతికను ఉపయోగించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. భారత వైమానిక శక్తిని పెంపొందించేందుకు రాకెట్ ఫోర్స్‌ ఉపకరిస్తుందని రావత్‌ చెప్పారు. జాతీయ భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాల మధ్య సమైక్యతను పెంచడం ముఖ్యమన్నారు. సాంకేతికత ప్రాధాన్యాన్ని త్రివిధ దళాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. దౌత్యం, సమాచారం, సైనిక, ఆర్థిక రంగాల తర్వాత సాంకేతికతను జాతీయ శక్తికి ఐదో స్తంభంగా పరిగణించాలని స్పష్టంచేశారు. ఇరాన్, టర్కీలతో స్నేహపూర్వక ఒప్పందాల తర్వాత చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని, త్వరలోనే అఫ్గనిస్థాన్‌లో అడుగుపెడుతుందని ఆయన హెచ్చరించారు. కన్ఫ్యూషియన్ లేదా చైనా నాగరికత వాస్తవానికి పాశ్చాత్య దేశాలను ఎదుర్కోవడానికి ఇస్లామిక్ సమాజంతో చేతులు కలుపుతుందని పేర్కొన్నారు. ‘తాలిబన్ ఆక్రమణలో ఉన్న అఫ్గనిస్థాన్‌లో పరిణామాలపై భారత్ వేచిచూస్తుంటే ప్రపంచం ఊహించిన దానికంటే వేగంగా చైనా ఆ దేశంతో సత్ససంబంధాలకు ప్రయత్నిస్తోంది.. భవిష్యత్తుల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు..అఫ్గనిస్థాన్‌లో మరింత గందరగోళం నెలకుని ఇప్పటి వరకు ఊహించలేని మార్పులు చోటుచేసుకోవచ్చు’ అని అన్నారు. ‘దక్షిణ చైనా సముద్రంలోని దేశాలతో డ్రాగన్ దూకుడుగా వ్యవహరిస్తోంది.. మన సరిహద్దుల్లో ప్రత్యక్ష దాడులు లేదా సాంకేతిక పరిజ్ఞానం రూపంలో దాడులకు పాల్పడినా మనం సిద్ధంగా ఉండాలి.. అన్ని భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత్ మొత్తం ప్రభుత్వ విధానాన్ని అవలంబిస్తోంది.. దేశం వివిధ రకాల క్షిపణుల కోసం కొత్త '' పెంచాలని చూస్తోంది. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల మధ్య మరింత సంధానం ఉండేలా చూస్తుంది’ అని తెలిపారు.


By September 16, 2021 at 12:45PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-is-looking-to-raise-new-rocket-force-for-missiles-says-cds-chief/articleshow/86255285.cms

No comments