ప్రపంచంలో అవి రెండే బెస్ట్.. మనషులు వాటిని చూసి నేర్చుకోవాలి: జగపతి బాబు
ఒకప్పుడు ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ మనస్సు దోచుకున్న స్టార్ హీరో. కుటుంబసమేతంగా కలిసి థియేటర్లకు వెళ్లి ఆయన సినిమాలు చూసేవాళ్లు. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఆయన సినిమాలు ఎంజాయ్ చేసే వాళ్లు. అయితే కొంతకాలం తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారడం.. సినిమాలు చూసే విధానంలో మార్పులు రావడంతో ఆయనకు హీరోగా సినిమా అవకాశాలు రావడం కరువయ్యాయి. దీంతో ఆయన కాస్త గ్యాప్ ఇచ్చి.. కొన్ని రోజుల తర్వాత వేరే గెటెప్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. అదీ విలన్ గెటప్‌లో. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆయనే . బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన జగ్గూభాయ్. ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్‌గా పలు సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలో నటిస్తూ.. ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేజీఎప్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ‘’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన నటిస్తున్న ‘రాజమనార్’ పాత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌లో ఉన్న జగపతి బాబు.. కాస్త విరామం దొరకడంతో ఆమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ ఆయన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఈ విషయాన్ని జగపతి బాబు స్వయంగా వెల్లడించారు. తన పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటున్న ఫోటోని షేర్ చేసిన ఆయన.. తన కుటుంబంతో.. తనకు ఇష్టమైన పెట్స్‌తో, ఇంకా తన పుస్తకాలతో సరదాగా సమయం గడపడం ఎంతో ఆనందగా ఉంది అని పేర్కొన్నారు. పెంపుడు జంతువులది స్వార్థం లేని ప్రేమ అని పేర్కొన్నారు. బుక్స్ మరియు పెట్స్ అన్నిటికన్న ఉత్తమమైనవి అని.. మనుషులు వాటిని చూసి ఎంతో నేర్చుకోవాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక సలార్‌తో పాటు ఆయన రిపబ్లిక్, పుష్ప, గని, మహాసముద్రం తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.
By September 16, 2021 at 12:22PM
No comments