Breaking News

అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం.. అర్ధరాత్రి ఉలిక్కిపడిన ప్రజలు


భూ ప్రకంపనలతో అండమాన్, నికోబార్ దీవుల్లో మంగళవారం రాత్రి వణికిపోయాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో మంగళవారం రాత్రి 11.45 గంటలకు సంభవించిన రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. పోర్ట్‌బ్లెయిర్ పట్టణానికి 202 కిలోమీటర్ల దూరం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆస్ట్రేలియాలోని సౌత్ మౌంట్ బుల్లర్ ప్రాంతంలోని విక్టోరియాలోనూ భూకంపం సంభవించింది. మెల్ బోర్న్ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనలతో మెల్ బోర్న్, విక్టోరియా ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగి ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల పలు భవనాలు, అపార్టుమెంట్లు దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా భవనాలు దెబ్బతింటే వెంటనే సమాచారం అందించాలని విక్టోరియా స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ట్వీట్‌ చేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో వరుస భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. దీనివల్ల పెద్దగా ఆస్తినష్టం సంభవించకపోయినా ఎప్పుడు భూమి కంపిస్తుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.


By September 22, 2021 at 07:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/earthquake-attack-for-3-9-magnitude-strikes-in-andaman-and-nicobar-island/articleshow/86415416.cms

No comments