ఢిల్లీలో అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి.. ఐదుగురి అరెస్ట్, ఆ వ్యాఖ్యలు ఫలితమే!
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దిల్లీలోని అశోక రోడ్డులో ఉన్న ఆయన ఇంటిపై మంగళవారం దాడి చేశారు. ప్రహారీ గోడ, గేటును ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దుండగులు ఇంటి కిటికీలు పగులగొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీసీపీ దీపక్ యాదవ్ మాట్లాడుతూ.. ‘అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడికి పాల్పడిన ఐదురుగు నిందితులను అరెస్టు చేశాం. నిందితులను హిందూసేన కార్యకర్తలుగా గుర్తింంచాం. ఎంపీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో కోపోద్రిక్తులై ఈ దాడికి పాల్పడినట్లు నిందితులు విచారణలో తెలిపారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ దాడిపై హిందూసేన అధినేత విష్ణు గుప్తా స్పందిస్తూ.. ఓవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందునే తమ కార్యకర్తలు ఆవేశం ఆపుకోలేక దాడికి పాల్పడి ఉంటారని స్ష్టం చేశారు.
By September 22, 2021 at 07:45AM
No comments