Breaking News

నేషనల్ కాన్ఫరెన్స్ నేత హత్య: ‘దృశ్యం’ సినిమా చూపించిన నిందితులు.. దర్యాప్తులో సంచలన నిజాలు!


త్రిలోచన్ సింగ్ వజీర్ (67) హత్య కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. త్రిలోచన్ సింగ్ ఢిల్లీలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సెప్టెంబరు 9న ఆయన మోతీనగర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఆయన మృతదేహం లభించింది. త్రిలోచన్‌కు పరిచయస్తుడు అమృత్‌సర్‌కు చెందిన హర్‌ప్రీత్ సింగ్ (31) అద్దెకు దిగిన ఇంటి బాత్‌రూమ్‌లో తలకు ప్లాస్టిక్ కవర్‌ చుట్టిన మృతదేహం గుర్తించింది. ఈ హత్యకు నిందితులు రెండు మూడు నెలల నుంచి వ్యూహరచన చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ‘దృశ్యం’ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ కేసులో జమ్మూకు చెందిన ఇద్దరు రాజేంద్ర చౌదరి అలియాస్ రాజు గంజా (33), బల్బీర్ సింగ్ అలియాస్ బిల్లా (67)‌లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు హర్‌ప్రీత్ సింగ్, హర్మీత్‌ సింగ్‌లు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీస్ టీంలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. త్రిలోచన్ సింగ్‌ను హత్యచేసిన తర్వాత ఆయన మృతదేహం మెట్రో స్టేషన్ లేదా ఢిల్లీ విమానాశ్రయం పరిసరాల్లో పడేయాలని ప్రయత్నించినా కుదరలేదు. ముంబయిలో ఉన్న తన క్లాస్‌మేట్ రాజేంద్ర చౌదరికి ఆగస్టు 14న ఫోన్ చేసిన హర్‌ప్రీత్.. ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రప్పించాడు. హర్‌ప్రీత్ సూచనలతో సెప్టెంబరు 1న ఢిల్లీలోని బసైదారాపూర్ నుంచి పంజాబ్‌కు వెళ్లిన రాజేంద్ర పంజాబ్ వెళ్లాడు. అక్కడ తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి.. అక్కడ నుంచి జమ్మూకు వెళ్లి మరో నెంబర్‌ను వినియోగించాడు. ‘సెప్టెంబరు 2న త్రిలోచన్ సింగ్ లాగేజ్‌ను తీసుకుని ట్యాక్సీలో ఢిల్లీకి బయలుదేరిన రాజేంద్ర.. పంజాబ్‌లో మళ్లీ తన పాత మొబైల్ నెంబర్‌ను ఆన్ చేశాడు.. మర్నాడు తిరిగి బసైదారాపూర్ చేరాడు.. అక్కడ నుంచి ఉదయం 11.30 గంటలకు వచ్చేశాడు.. సాయంత్రం 5.30 గంటలకు కశ్మీరీ గేట్ వద్ద మిగతా నిందితులను కలుసుకున్నాడు.. వజీర్‌ను చంపడానికి అక్కడే వ్యూహరచన చేశారు’ అని పోలీసులు తెలిపారు. ‘తొలుత త్రిలోచన్ సింగ్‌కు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత తుపాకితో కాల్చిచంపాలని నిర్ణయించారు.. ప్లాన్‌లో భాగంగా హర్మీత్‌ చేతికి హర్‌ప్రీత్ తుపాకి ఇచ్చాడు.. హత్య తర్వాత ఫ్లాట్‌లో రక్తపు మరకలను తుడిచేసి.. మృతదేహాన్ని బాత్‌రూమ్‌కి తరలించారు.. కాల్ రికార్డు ఆధారంగా నిందితులను గుర్తించినట్టు’ పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 3 తర్వాత హర్‌ప్రీత్ పలు ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేశాడని, అందులో ఒకటి రాజేంద్ర చౌదరి తల్లి పేరుతో ఉందని గుర్తించామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి విచారించగా 1983లో హర్‌ప్రీత్ మేనమామ దారుణహత్యకు గురికాగా.. ఈ కేసులో అరెస్టయి మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించారు. మేనమేమ హత్యకు ప్రతీకారంగానే వజీర్‌ను చంపినట్టు రాజేంద్ర వెల్లడించాడు. వజీర్ హత్యకు, నాటి ట్రిపుల్ మర్డర్‌తో సంబంధాలపై నిజానిజాలను వెలికితీస్తామని తెలిపారు.


By September 17, 2021 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/national-conference-leader-trilochan-singh-murder-was-planned-for-over-2-months/articleshow/86285284.cms

No comments