ఇరువురు భామల కౌగిలిలో రామ్ గోపాల్ వర్మ.. ఆర్జీవీ 'కోతి' పనులు! ఏకంగా అక్కడ కిస్.. బాబోయ్ ఏంటిది?
ఎంజాయ్ అంటే వర్మదే.. రొమాంటిక్ మూడ్ ఆస్వాదించాలంటే వర్మ తర్వాతే ఎవరైనా. ఇదీ ప్రెజెంట్ రామ్ గోపాల్ వర్మపై జనాలకున్న అభిప్రాయం. ఇటీవలి కాలంలో వర్మ చేస్తున్న బోల్డ్ ఇంటర్వ్యూలు, అందాల భామల మత్తులో ఊగిపోవడాలు చూసి షాకవుతున్నారు పబ్లిక్. ఓపెన్‌గా వర్మ వెళ్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే వర్మ మాత్రం.. తాను ఎలాంటి తప్పు చేయడం లేదని, చట్టానికి లోబడి తనకు నచ్చినట్లుగా ఉంటున్నానని అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే తన సోషల్ మీడియా వాల్‌పై హాట్ బ్యూటీలను దింపేశారు వర్మ. ఇద్దరు బ్యూటీల కౌగిలిలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేశారు. పబ్బులో గ్లామర్ బ్యూటీలతో రొమాంటిక్ జోష్‌లో హంగామా చేస్తూ ఆ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గ్లామరస్ హీరోయిన్ సోనియాతో పాటు మరో బ్యూటీతో క్లబ్‌లో ఫుల్ ఎంజాయ్ చేసినట్లు చెప్పకనే చెప్పిన .. ''ఇద్దరు అందాల భామల నడుమ కోతి'' అంటూ 'రండి మీరు కూడా మాతో జాయిన్ కండి' అంటూ ఏకంగా ఆ క్లబ్ లొకేషన్ కూడా పోస్ట్ చేశారు. ఆ వెంటనే మరో బోల్డ్ పోస్ట్ చేస్తూ పరేషాన్ చేశారు వర్మ. నటి థైస్‌ని ముద్దాడుతూ దిగిన రొమాంటిక్ పిక్ షేర్ చేశారు. ఇంకేముంది ఈ పిక్స్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారాయి. 'అబ్బ లైఫ్ అంటే వర్మది, ముద్దుగుమ్మలతో ఎంజాయ్ చేయాలంటే నీ తర్వాతే ఎవ్వరైనా సామీ' అంటూ ఆ ఫోటోలకు తగ్గట్లుగా రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా వర్మ తీరు మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. హాట్ బ్యూటీలను ప్రమోట్ చేయడంలో వర్మ దూసుకుపోయే విధానం చర్చనీయాంశం అయింది. తప్పుబట్టలా లేక ఎంకరేజ్ చేయాలా అనేది ఎవ్వరికీ అర్థంకాని స్టైల్‌లో ఆయన దూసుకెళ్తున్నారు. అరియానా, అప్సర రాణి, నైనా గంగూలీ, ఇనయా సుల్తానా, జ్యోతి, అషు రెడ్డి, సోనియా ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ ఎంజాయ్ చేసిన అందాల భామల లిస్ట్‌కి అంత ఈజీగా ఫుల్‌స్టాప్ పెట్టలేం బాబోయ్!.
By September 17, 2021 at 11:37AM
No comments