Breaking News

హెలికాప్టర్‌కు శవాన్ని వేలాడదీసి గగనవిహారం.. అలా అమెరికా వెళ్లగానే ఆరాచకం ఆరంభం


హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఎప్పటిలాగే తమ సహజ ప్రవర్తనను కొనసాగిస్తున్నారు. గతంలో తమకు వ్యతిరేకంగా పనిచేసినవారి నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అఫ్గన్‌ గడ్డ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగిన కొద్ది సేపటికే కాబూల్‌ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నారు. అయితే ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి తాలిబన్లు కాందహార్‌ గగనవీధుల్లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గన్‌‌లో యుద్ధం ముగించుకుని వెనుదిరిగిన అమెరికా సైన్యం కొన్ని ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లింది. అమెరికా సైన్యానికి చెందిన ఓ యుద్ధ హెలికాప్టర్‌లో తాలిబన్లు కాందహార్‌ పట్టణంలో విహరించారు. ఆ హెలికాప్టర్‌కు ఓ వ్యక్తిని తాడుతో వేలాడదీసి గాల్లోకి ఎగిరారు. ఆ వ్యక్తిని తాడుకు వేలాడుతుంటాన్ని పలువురు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది వ్యక్తి మృతదేహమేనని, అతడిని చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారని అఫ్గన్‌లోని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా సైన్యం పలు యుద్ధ విమానాలు, ఆయుధాలను కాబూల్ విమానాశ్రయంలో వదిలేసి సోమవారం అర్ధరాత్రే హడావుడిగా నిష్క్రమించింది. అంతకు ముందే వాటిని నిర్వీర్యం చేశామని అమెరికా వెల్లడించినప్పటికీ.. అది వాస్తవం కాదని స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా అమెరికా హెలికాప్టర్‌లో తాలిబన్లు విహరించడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. అఫ్గన్ నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను ‘తాలిబ్ టైమ్స్’ తన అధికార ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘మా వైమానిక దళం! ఈ సమయంలో ఇస్లామిక్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కందహార్ నగరంపై ఎగురుతూ గస్తీ తిరుగుతున్నాయి’ అని ట్వీట్ చేసింది. దీనిపై అమెరికా చట్టసభ ప్రతినిధి రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్.. అధ్యక్షుడికి ట్యాగ్ చేస్తూ.. అధ్యక్షుడు జో బైడెన్ అఫ్గన్ విధానానికి నిదర్శనం అని విమర్శించారు. ‘ఈ భయానక చిత్రం జో బైడెన్ అఫ్గన్ విపత్తుకు ఉదాహరణ.. తాలిబాన్లు ఒక వ్యక్తిని అమెరికన్ బ్లాక్‌హాక్ హెలికాప్టర్ నుంచి ఉరితీశారు. ఊహించలేని విషాదం ఇది’ క్రజ్ ఆవేదన వ్యక్తం చేశారు.


By September 01, 2021 at 07:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/video-of-taliban-flying-us-chopper-with-body-dangling-in-kandahar/articleshow/85821684.cms

No comments