Breaking News

సుప్రీం సంచలన తీర్పు.. ఆ 40 అంతస్తుల టవర్లు కూల్చేయాలని ఆదేశం!


సూపర్‌టెక్‌ రియాలిటీ సంస్థ కేసులో సంచనల తీర్పు వెలువరించింది. ఈ సంస్థ నోయిడాలో 40 అంతస్తులతో నిర్మించిన ట్విన్‌ టవర్లను కూల్చివేయాలని మంగళవారం ఆదేశించింది.ఎమరాల్డ్‌ కోర్ట్‌ పేరిట నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల సహకారంతో ఈ రెండు టవర్ల ను నిర్మించినట్లు తమ విచారణలో వెల్లడయ్యిందని పేర్కొంది. అపెక్స్‌, సియాన్‌ టవర్లు నిర్మాణంలో ఉండగానే 2009లో స్థానిక రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అలాహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. భవన నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించారని, రెండు టవర్లను కూల్చివేయాలని 2017లో హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సూపర్‌టెక్‌ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఆ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. రెండు టవర్లను మూడు నెలల్లోగా కూల్చివేయాలని యూపీ ప్రభుత్వాన్ని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం ఆదేశించింది. జంట టవర్లలో మొత్తం 915 ఫ్లాట్లు, కొన్ని దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఫ్లాట్లు కొనుగోలుచేసిన వారికి బుక్‌ చేసుకున్న తేదీ నుంచి 12శాతం వడ్డీతో సహా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు రూ.2 కోట్లు చెల్లించాలని సూపర్‌టెక్‌ సంస్థకు స్పష్టం చేసింది. ఈ నిర్మాణం విషయంలో నోయిడా అధికారులు, నిర్మాణ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అధికారులు కుమ్మక్కయి అక్రమ నిర్మాణాలకు అనుమతించారని మండిపడింది. డెవలపర్లు, అధికారుల సహకారంతో పట్టణ ప్రాంతాల్లో అనధికారిక నిర్మాణాల సంఖ్య పెరిగిందని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది.


By September 01, 2021 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-verdict-supertech-case-orders-to-demolish-noida-twin-towers/articleshow/85822055.cms

No comments