Breaking News

Taliban సెక్స్ బానిసలుగా అమ్మాయిలు.. సరిగ్గా వండలేదని మహిళకు నిప్పు.. అఫ్గన్‌లో తాలిబన్ల దురాగతాలు


మహిళల హక్కులను గౌరవిస్తామని, వారినీ ఉద్యోగాలకు అనుమతిస్తామన్న తాలిబన్ల చేసినవి బూటకపు ప్రకటనలేనని తేలిపోయింది. గతానికి భిన్నంగా వారేమీ ప్రవర్తించడం లేదనే వాదనలకు బలం చేకూర్చే ఘటనలు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, అఫ్గానిస్థాన్‌కు చెందిన మాజీ న్యాయమూర్తి వారి దురాగతాలను బయటపెట్టారు. ‘స్కై న్యూస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గన్‌‌లోని మహిళలపై తాలిబన్లు జరుపుతున్న అరాచకాలు, దారుణాలను వెల్లడించారు. ఉత్తర్ అఫ్గనిస్థాన్‌కు చెందిన ఓ మహిళను మూకలు తమకు సరిగ్గా వండిపెట్టలేదన్న కారణంతో చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పంటించారని ఆయూబీ తెలిపారు. ‘తాలిబన్‌ ఫైటర్లకు వండిపెట్టాలని అక్కడి ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు.. గత కొన్ని వారాలుగా స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్‌ బానిసలుగా మార్చేందుకు ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారు.. ఆయా ప్రాంతాల్లోని యువతులను ఉగ్రవాదులకిచ్చి వివాహం చేయాలనీ అక్కడి కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నారు’ అని అయూబ్ భయంకర విషయాలు వెల్లడించారు. ఓ వైపు ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ.. మరోవైపు మహిళలను స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని హామీలు ఇస్తున్నారని ఆయూబీ వివరించారు. మహిళల హక్కుల కోసం పోరాడే తనలాంటి వారు తాలిబన్ల పాలనలో జీవించడం కష్టమన్న ఉద్దేశంతోనే తాను అఫ్గనిస్థాన్ నుంచి పారిపోయి వచ్చి అమెరికాలో ఆశ్రయం పొందినట్టు తెలిపారు. తాను, మహిళను కాబట్టి పొరుగుంటిలో ఉండే మహిళ కుమారుడితో కిరాణా దుకాణానికి వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న హింస, అన్యాయాన్ని ప్రశ్నించే సంకీర్ణ, ప్రపంచ కార్యక్రమాలకు అధ్యక్షురాలిగా ఆయూబ్ వ్యవహరిస్తున్నారు. తాలిబన్‌లు అఫ్గన్‌ను హస్తగతం చేసుకునే వరకూ ఆమె అక్కడ అత్యంత శక్తివంతమైన స్థానంలో ఉన్నారు. 90 వదశకంలో తాలిబన్లు అధికారంలోకి రాక ముందు ఉత్తర అఫ్గనిస్థాన్‌లోని విద్యాభ్యాసం చేసిన ఆయూబ్.. ఆ ప్రావిన్సుల్లో తొలి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో తాలిబన్ల శకం ముగిసిన తర్వాత అఫ్గన్ రాజ్యాంగం రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషించారు. కాగా, తమను కార్యాలయాలకు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారంటూ ఇప్పటికే పలువురు మహిళా జర్నలిస్టులు తమ గోడును ప్రపంచానికి వెళ్లబోసుకున్నారు. ‘తిరిగి ఉద్యోగానికి వెళ్లాలనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు నన్ను పని చేయడానికి అనుమతించలేదు.. పాలన మారిందని, మీరు పని చేయలేరని యాజమాన్యం నాకు చెప్పింది’ అని రేడియో టెలివిజన్ అఫ్గనిస్థాన్‌లో యాంకర్‌గా పనిచేసిన షబ్నామ్ ఖాన్ దర్వాన్ అనే మహిళ వాపోయింది. ‘మేము మా విద్య హక్కు, పని చేసే హక్కు, రాజకీయ మరియు సామాజిక భాగస్వామ్య హక్కులను వదులుకోం’ అని ఫరిహా ఎసార్ అనే ఓ మానవహక్కుల కార్యకర్త ఉద్ఘాటించింది. మహిళలకు పనిచేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ తాలిబన్లు ప్రకటించిన కొద్దిరోజులకే ఈ ఘటనలు జరగడం గమనార్హం. దీంతో మహిళల హక్కుల పరిరక్షణకు వారిచ్చిన హామీ నీటిమీద రాతలే అని తేలిపోయింది. ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఈ దారుణాలను చూస్తుంటే అఫ్గాన్‌లో పరిస్థితులు మున్ముందు మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


By August 22, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghan-women-used-as-sex-slaves-by-taliban-says-former-judge-najla-ayoubi/articleshow/85528601.cms

No comments