Breaking News

Taliban కాబూల్‌లో రాకెట్ దాడి.. యాంటీ-క్షిపణి వ్యవస్థతో కూల్చేసిన అమెరికా


అమెరికా దళాల తరలింపు ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. బలగాల ఉపసంహరణకు విధించిన గడువు రేపటితో ముగియనుండగా.. వద్ద రద్దీ కొనసాగుతోంది. అఫ్గన్ పౌరుల‌తో పాటు విదేశీయులు కాబుల్ విమానాశ్ర‌యం నుంచి విదేశాల‌కు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉగ్ర‌వాదులు దాడుల‌కు తెగబడటం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల కిందట జ‌రిగిన భారీ ఉగ్ర‌దాడి కళ్లముందే కదలాడుతుండగా తాజాగా సోమవారం ఉద‌యం 6.40 గంటలకు మరోసారి రాకెట్ దాడి జరిగింది. ఓ వాహనం నుంచి రాకెట్లను ఉగ్రవాదులు ప్రయోగించి దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రాకెట్ దాడితో అక్క‌డ ప‌రిస‌రాలు పొగతో నిండిపోగా.. కాబుల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూనివర్సిటీ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్టు గుర్తించారు. ఈ రాకెట్‌ను యాంటీ క్షిపణి వ్యవస్థ సాయంతో అడ్డుకుని కూల్చివేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ రాకెట్ శకలాలు సలీమ్ కర్వేట్ ప్రాంతంలో గుర్తించినట్టు అమెరికా తెలిపింది. కాబూల్ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగినా బలగాల తరలింపు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతోందని ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ‘కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని అధ్యక్షుడికి తెలియజేశాం.. అఫ్గన్‌లో మన బలగాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుని కమాండర్లు తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాలన్న ఆదేశాన్ని బైడెన్ పునరుద్ఘాటించారు’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, నాటో ద‌ళాలు అఫ్గన్‌లో ఇంకా కొద్ది సంఖ్యలో ఉండగా.. పూర్తిగా వైదొలగిన తర్వాత అఫ్గన్‌లు ఎటువంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. కాబూల్‌లో విమానాశ్రయంపై వచ్చే 36 గంటల్లో ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌వ‌చ్చ‌ని అమెరికా ఆదివారం హెచ్చ‌రించిన విషయం తెలిసిందే. తాజా ఉగ్ర‌దాడిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. ఇప్పటి వరకూ కాబూల్ విమానాశ్రయం నుంచి 114,000 మందిని తరలించినట్టు అమెరికా పేర్కొంది. మంగళవారంతో ఈ ప్రక్రియ ముగియనుంది.


By August 30, 2021 at 11:28AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-rockets-fired-at-kabul-airport-intercepted-by-defence-system/articleshow/85758596.cms

No comments