Breaking News

Sharada Death Rumors : ఊర్వశీ శారద మృతిపై రూమర్లు.. ఘాటుగా స్పందించిన సీనియర్ నటి


సీనియర్ నటి ఊర్వశీ మరణించినట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి. అయితే మనం ఉన్నది సోషల్ మీడియా కాలంలో అని మరిచిపోవద్దు. ఇక్కడ నిజాల కంటే అబద్దాలు, రూమర్లే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటాయి. అలా ఎవరో ఆకతాయి, ఆకాశ రామన్న వేసిన పోస్ట్‌తో శారద మరణ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాసాగాయి. అయితే ఇందులో కొందరు వెంటనే తమ తప్పు తెలసుకుని, అసలు నిజం గ్రహించి తమ పోస్ట్‌లు డిలీట్ చేసేశారు. క్షేమంగానే ఉన్నారనే సమాచారాన్ని అందిస్తున్నారు. కానీ పాజిటివ్ వార్త కంటే నెగెటివ్ వార్తే ఎక్కువగా జనాల్లోకి రీచ్ అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో శారద మృతిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై శారద స్పందించారు. తన ఆప్తమిత్రుడు తిరుపతి జర్నలిస్టు దందోలు గిరితో నటి శారదమ్మ ఫోన్‌లో సంభాషించారు. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దని తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఎవరో పనికి మాలిన వాళ్లు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఉంటారని ఘాటుగా స్పందించారు. ఎవరో ఎదవ చేసిన పనికి అందరూ ఏడుస్తున్నారు.. చివరకు మగాళ్లను కూడా ఏడిపించేశాడు. ఇలా అల్లరల్లరి చేసి పారేశాడు. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. నేను క్షేమంగానే ఉన్నాను. కానీ ఎవరో పాపం ఊహించి. . ఇలా రాసి.. చాలా మందిని బాధపెట్టేశారు.. అది చాలా తప్పు.. పనీపాటా లేని వారు ఏదైనా మంచి పని చేసుకోవాలి.. ఇకనైనా పద్దతి మార్చుకోవాలి అని శారద తనపై వస్తోన్న రూమర్లను ఖండించారు.


By August 08, 2021 at 01:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actress-sharada-fires-on-death-rumors/articleshow/85147740.cms

No comments