Ram Charan : ఉక్రెయిన్‌లో ఉపాసన.. పెళ్లాం జీవితం ఇలానే ఉంటుందట.. కేరవ్యాన్‌లో మెగా కోడలి రచ్చ
ప్రస్తుతం మెగాపవర్ స్టార్ ఎక్కడున్నారో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మీద రాజమౌళి క్లైమాక్స్ సీన్లను ఉక్రెయిన్‌లో ప్లాన్ చేశారు. ఇక ఈ షెడ్యూల్‌లోనే ఎన్టీఆర్ హీరోయిన్ ఒలివియా మోరిస్ కూడా జాయిన్ అయ్యారు. అక్కడే బ్రిటీష్ సామ్రాజ్యం, యుద్దానికి సంబంధించిన సీన్లను తెరకెక్కించబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉక్రెయిన్ షెడ్యూల్ ఫుల్ ఫన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. యూనిట్‌కు సంబంధం లేని వారు కూడా ఉక్రెయిన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. శోభు యార్లగడ్డ కూడా ఉక్రెయిన్ షెడ్యూల్‌లో జాయిన్ అయినట్టు ఆ మధ్య ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అయితే తాజాగా రామ్ చరణ్‌కు సంబంధించిన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌కు రామ్ చరణ్ ఒక్కడే వెళ్లలేదని తెలిసిపోయింది. ఆయన వెంట కూడా వెళ్లారు. ఈ మేరకు మెగా కోడలు షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. మామూలుగా అయితే హీరోలు తమ ఫ్యామిలీని కూడా ఇలా విదేశాలకు తీసుకెళ్తుంటారు. షూటింగ్ ఓ వైపు జరుగుతూ ఉంటే.. మరో వైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. అలా తాజాగా రామ్ చరణ్ కూడా అదే ప్లాన్ వేసినట్టున్నారు. సాధారణంగా అయితే ఉపాసన షూటింగ్‌లకు వస్తూ ఉంటారు. రామ్ చరణ్ సినిమా షూటింగ్‌లో ఉపాసన కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎక్కడైనా విదేశాల్లో రామ్ చరణ్ షూటింగ్ అంటే ఉపాసన కూడా ఉంటారు.తాజాగా ఈ ఉక్రెయిన్ షెడ్యూల్ కోసం ఉపాసన వెళ్లినట్టున్నారు. తాజాగా ఉపాసన ఓ పోస్ట్ చేశారు. ఇందులో కేరవ్యాన్‌లో హాయిగా కూర్చుని ఉన్నఫోటోను షేర్ చేస్తూ... పెళ్లాం జీవితం ఇలానే ఉంటుందనేట్టుగా #wifelife అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
By August 08, 2021 at 01:16PM
No comments