Salaar : Prabhas స్టైలే వేరు.. శ్రుతీ హాసన్‌కు స్పెషల్ పార్టీ.. వంటకాల లిస్ట్ చూస్తే షాక్!!
కొంత మంది హీరో హీరోయన్లు సెట్‌లో చేసే మర్యాదలు వేరే లెవెల్‌లో ఉంటాయి. మరీ ముఖ్యంగా మన హీరోలు మాత్రం ఇంటి నుంచి తెచ్చిన వంటకాలను అందరికీ వడ్డిస్తుంటారు. హోటల్ భోజనాన్ని కాకుండా ఇంట్లో ప్రత్యేకంగా వండించి మరీ తీసుకొస్తారు. అలా మామూలుగానే తన సెట్‌లో ఓ రెస్టారెంట్ లాంటి లిస్ట్ తీసుకొస్తాడట. ఇక ప్రభాస్ ఇంట్లోనూ నిత్యం అలానే ఉంటుందట. ఎంతో మంది రావడం, తినడం వంటివి జరుగుతూనే ఉంటాయట. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు భార్య తమ అతిథి మర్యాదల గురించి చెప్పుకొచ్చారు. అలా ప్రభాస్ తాజాగా సెట్‌లో అందరికీ నోరూరిపోయేలా వంటకాలను వండించి మరీ తీసుకొచ్చినట్టున్నారు. ఈ మేరకు ముందు చాంతాండ లిస్ట్ పెట్టేసినట్టున్నారు. శ్రుతీ హాసన్ నిన్న డిన్నర్‌లో ఫుల్లుగా ఆరగించేసినట్టు కనిపిస్తోంది. దాదాపు 20 రకాల వంటకాలను ప్రభాస్ స్పెషల్‌గా తీసుకొచ్చారట. ఇక వాటిని శ్రుతీ హాసన్ ఆరగించేసినట్టున్నారు. ఈ మేరకు ప్రతీ ఒక్క వంటకం గురించి శ్రుతీ హాసన్ చెప్పుకొచ్చారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీలు ఇలా తెచ్చిన వెరైటీ వంటకాలన్నింటిని చూపించారు. ఇన్ని రకాల వంటకాలను ముందు పెట్టినందుకు థ్యాంక్యూ అన్నట్టుగా ప్రభాస్ మీద ప్రేమను కురిపించారు శ్రుతీ హాసన్. ప్రస్తుతం ఈ వంటకాలకు సంబంధించిన లిస్ట్, వీడియోను చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ కోసం ఈ మధ్యే శ్రుతీ హాసన్ ముంబై నుంచి హైద్రాబాద్‌కు వచ్చారు.
By August 08, 2021 at 11:40AM
No comments